Fitness: ఫిట్‌నెస్ అంటే జిమ్‌కి వెళ్లి చెమటోడ్చడం మాత్రమే కాదు. మన ప్లేట్‌లో పెట్టుకునే ఆహారమే ఆరోగ్యానికి అసలు బలం అని సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ సిద్ధార్థ్ సింగ్ చెబుతున్నారు. తమన్నా భాటియా, కంగనా రనౌత్ వంటి స్టార్‌లకు ట్రైనింగ్ ఇచ్చిన ఆయన, డిసెంబర్ 2న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆరోగ్యకరమైన లంచ్ ఎలా ఉండాలో తెలిపాడు.
సాధారణంగా భారతీయుల మధ్యాహ్న భోజనంలో తెలియకుండానే ‘కార్బోహైడ్రేట్‌తో కార్బోహైడ్రేట్’ తింటారని సిద్ధార్థ్ అంటున్నారు. “ పెద్ద గిన్నెలో కూర, పక్కన మూడు, నాలుగు రొట్టెలు పెట్టుకుని తింటారు. ఇది మొత్తం కార్బ్స్ అన్న మాట. కాబట్టి, ఈ ప్లేట్‌ని బ్యాలెన్స్ చేయాలి,” అని ఆయన సూచించారు.
Also Read: Ramchander Rao: ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? : రాంచందర్ రావు
ఆరోగ్యకరమైన లంచ్ కోసం సిద్ధార్థ్ చెప్పిన నాలుగు సింపుల్ చిట్కాలు
1. రొట్టెలను తగ్గించండి
రోజుకి 8–10 రొట్టెలు అవసరం లేదు. ఒకటి చాలు. అధిక రొట్టెలు రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి బరువు నియంత్రణకు ఆటంకంగా మారుతాయని తెలిపారు. రొట్టెలను తినడం తగ్గించటం వల్ల ప్లేట్‌లో ఇతర పోషకాలు చేర్చడానికి ప్లేస్
కూడా దొరుకుతుంది.
2. కూర పరిమాణాన్ని కంట్రోల్ చేయండి
ఆలూ కీ సబ్జీ కూడా కార్బోహైడ్రేట్‌నే అయినా, అది అర్థరహితమని కాదు. కానీ ఎక్కువగా తింటే కేలరీలు పెరుగుతాయని సిద్ధార్థ్ హెచ్చరించారు. “ఇంట్లో ప్రేమగా చేసిన కూరే అయినా, కొంచెం మాత్రమే తీసుకోండి,” అన్నారు.
3. ప్లేట్‌లో తప్పనిసరిగా ఫైబర్ చేర్చండి
ఒక చిన్న గిన్నె సలాడ్ చాలు. దీనిలో కూడా ఫైబర్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియ మెరుగుపరచి, ఎక్కువ సేపు తృప్తిగా ఉంచుతుందని చెప్పారు. రా వెజిటబుల్స్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ మొత్తం భోజనాన్ని బ్యాలెన్స్ చేస్తాయి.
4. ప్రోటీన్‌ను ఎప్పుడూ మర్చిపోవద్దు
మీరు తినే “ప్లేట్‌లో ప్రోటీన్ ఎక్కడ ఉంది?” అంటూ సిద్ధార్థ్ ప్రశ్నించారు. గ్రీక్ యోగర్ట్‌ను రోజులో చేర్చాలని సూచించారు. “అర కప్పు యోగర్ట్‌లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆఫీసుకి కూడా ఈజీగా తీసుకెళ్లొచ్చు,” అన్నారు. గ్రీక్ యోగర్ట్ నచ్చకపోతే, హై-ప్రోటీన్ పనీర్‌ను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చని తెలిపారు.
సాధారణంగా కనిపించే లంచ్‌లో చిన్న మార్పులు చేస్తేనే పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయని ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ స్పష్టం చేశారు. బ్యాలెన్స్‌డ్ ప్లేట్ అంటే కేవలం పొట్ట నింపడం కాదు, రోజంతా శక్తివంతంగా ఉంచే పోషకాలను సమానంగా చేర్చుకోవడమే అని ఆయన తెలిపారు.
