Mahabubabad Crime: బయ్యారం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తల్లి లేని సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లి కూతురిపై అత్యాచారం జరిపాడు. ఇది గత కొంతకాలంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇటీవలనే గర్భం దాల్చిన కూతురును సీక్రెట్ గా ఆసుపత్రికి తరలించి అబార్షన్ చేయించారు. ఈ క్రమంలోనే మైనర్ బాలిక బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Also Read: Mahabubabad Crime: ప్రియుడికోసం భర్తను.. పథకం ప్రకారమే.. లక్షల సుపారి ఇచ్చి హత్య!
ఫోక్సో కేసు నమోదు
దీంతో మహిళ కూతురు మైనర్ కావడంతో అత్యాచారం జరిపిన వ్యక్తి, బాలిక తల్లి పై కూడా ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా బయ్యారం ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకాలం రేపుతుంది. నిందితుడిని, మైనర్ బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తన కూతురిపై అత్యాచారం జరిపిన వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉండడంతో ఈ విషయం బయ్యారం మండలంలో విస్తృత చర్చ జరుగుతోంది.
Also Read: Warangal Crime: వరంగల్ బాలాజీ నగర్‌లో దారుణం.. భార్యను గొంతు నులిమి చంపిన భర్త
అసలు వాళ్లు పెట్టుకుందే సమాజానికి విరుద్ధమైన చర్య. పైనుంచి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కూతురు ఆ వ్యక్తికి కూతురు వరుస కావాలి. అయినప్పటికీ ఎవరిని లేని సమయంలో ఆ మహిళ ఇంటికి వెళ్లి బాలికపై పలుమార్లు అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. ఎవరి కంట పడకుండా సీక్రెట్ గా మహిళ తన కూతుర్ని ఆసుపత్రికి తరలించి అబార్షన్ చేయించినట్లుగా అక్కడ చర్చ జరుగుతుంది.
