Investment Scam: ఇచ్చిన నగదుకు అధిక ఇంట్రెస్ట్ ఆశ చూపి సుమారు 300 మందిని ఓ ఫైనాన్స్ సంస్థ నిండా ముంచేసింది. కన్న బిడ్డల భవిష్యత్తుకు కూడబెట్టిన ధనమంతా మాయమాటలతో దోచేసి ఉడాయించింది. సుమారు రూ. 330 కోట్లను అక్రమంగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఫైనాన్స్ సంస్థ లీగల్ అడ్వైజర్, డైరెక్టర్ ఇంటి ఎదుట బాధితులు ఆందోళన చేసిన సంఘటన సచలనం సృష్టించింది.
క్యాపిటల్ ఫైనాన్స్ సంస్థ
నల్టోండ పట్టణ కేంద్రంలోనివెంకటేశ్వర కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా పరిధికి చెందిన సుమారు 300 మంది నుంచి 12 క్యాపిటల్ ఫైనాన్స్ సంస్థ(Capital Finance Company) రూ. 100 నాలుగు రూపాయల వడ్డీ ఇస్తామని కోట్లు వసూలు చేసింది. తమ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థల్లో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభంతో వడ్డీలు ఇస్తామని ప్రచారం చేసింది. దీంతో సదరు ఫైనాన్స్ సంస్థ డైరెక్టర్ల మోసపూరిత మాటలను నమ్మిన అమాయక జనం కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఫైనాన్స్ క్యాపిటల్ సంస్థలో పెట్టేశారు.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణను దేశానికే దిక్సూచి చేస్తాం.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్!
మియాపూర్ కేంద్రంగా..
అనంతరం తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో సంస్థలో పట్టణ కేంద్రానికి చెందిన రాపోలు ప్రకాశ్(Rapolu Prakash)ఆ కంపెనీలో లీగల్ అడ్వైజర్(Legal Advisor)గా అతని భార్య సోమేశ్వరి(Someswari) డైరెక్టర్‌గా ఉన్న సోమేశ్వరి నల్గొండకు వచ్చినట్లు తెలుసుకొని వారి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. హైదరాబాద్(Hyderabad) మియాపూర్ కేంద్రంగా ఫైనాన్స్ సంస్థను స్థాపించి 12 మంది డైరెక్టర్లను నియమించి కోట్లు వసూలు చేశారు. ఫైనాన్స్ సంస్థ బాధితుల ఆందోళన విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఆందోళన వద్దకు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో భాదితులు విరమించారు.
Also Read: Collector Pravinya: నేషనల్ హైవేపై పనులు త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

