Chamala Kiran Kumar Reddy: ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ జరగడం దారుణమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ హక్కులపై పోరాడుతామన్నారు. ప్రస్తుతం కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ఎన్డీయే,బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పార్లమెంట్ లో సమస్యలపై చర్చ జరగకూడదని బీజేపీ (Bjp) ఎజెండాగా కనిపిస్తోందన్నారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: నవీన్ యాదవ్ ర్యాలీ చూసి బీఆర్ఎస్ కు దడ.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
అధికారంలో పర్మినెంట్ గా ఉండాలి
దేశంలో అనేక సమస్యలపై చర్చలు జరగాలన్నారు. దేశ భద్రతపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు దాడి జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎస్.ఐ.ఆర్ పేరిట ప్రజల ఓటు హక్కును కాలారాసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికారంలో పర్మినెంట్ గా ఉండాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నారని, సెక్యూరిటీ ఆఫ్ పీపుల్,సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.
హెల్త్ పైన పార్లమెంట్ లో చర్చ చేయాలి
దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పైన పార్లమెంట్ లో చర్చ చేయాలన్నారు. 18 వ లోక్ సభలో నితీష్ కుమార్ కు అవసరం అయితే బీహార్ రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడుకు అవసరం అయితే ఏపీకి నిధులు, ప్రాజెక్టులు కేంద్రం ఇస్తుందన్నారు. 18 వ లోక్ సభలో తమ పట్టు కోల్పోకుండా ఉండేందుకు అలయన్స్ పార్టీలకు నిధులు ఇస్తున్నారన్నారు. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు.

