Makthal SP Vineeth: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు బందోబస్తు
Makthal SP Vineeth ( image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Makthal SP Vineeth: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు.. 800 సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు!

Makthal SP Vineeth: మక్తల్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RevanthReddy) పర్యటనలో చిన్న లోపం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన గాను మొత్తం 800 మంది పోలీసు అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మక్తల్ లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంలో  సాయంత్రం సీఎం  రేవంత్ రెడ్డి పర్యటన బందోబస్తుకు వివిధ జిల్లాలో నుండి వచ్చిన పోలీసులకు, జిల్లా పోలీసులకు అదనపు ఎస్పీలు .03, డీఎస్పీ.04, సిఐ లు.31, ఎస్ఐ లు.85, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్ లు 145, కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు, హోమ్ గార్డ్స్ ఆఫీసర్ లు 04 టిఎస్ఎస్పి ప్లాటున్స్ మొత్తం 800 మంది పోలీసు అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.

Also Read: CM Revanth Reddy: రండి.. తరలిరండి తెలంగాణలో పాలుపంచుకోండి: సీఎం రేవంత్ రెడ్డి

భద్రతపై నిశితంగా, సమన్వయంతో పని చేయాలి

సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును 12 సెక్టార్లుగా విభజించి, ఆయా సెక్టార్లకు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఇన్‌చార్జీలుగా నియమించామని, భద్రతపై నిశితంగా, సమన్వయంతో పని చేయాలని సీనియర్ అధికారులను బాధ్యతల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక భద్రతా బృందాలు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాయని అన్నారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని హెలిపాడ్ నుండి కాన్వాయ్ లో పబ్లిక్ మీటింగ్ కి వచ్చే వరకు బందోబస్తును రోడ్ ఓపెనింగ్ పార్టీలు, రోఫ్ పార్టీలు, పెట్రోలింగ్ టీములు, ట్రాఫిక్ డైవర్షన్, పికేటింగ్, రూఫ్ టఫ్ సెంట్రి లు, బాంబ్ స్క్వాడ్ & డాగ్ స్క్వాడ్ టీములు, క్విక్ రెస్పాన్స్ టీములు, పార్కింగ్ బందోబస్తును ఏర్పాటు చేశాం.

ఎక్కడ  డ్యూటీ లు వేస్తే అక్కడ అప్రమత్తంగా ఉండాలి

ఎవరికి ఎక్కడ డ్యూటీ లు వేస్తే అక్కడ అప్రమత్తంగా ఉండాలన్నారు, అనుమానాస్పద వ్యక్తులు. వస్తువులను గమనిస్తే వెంటనే పై అధికార్లకు నివేదించాలని ఎస్పీ అన్నారు. పోలీసులకు మంచి నీళ్ళు,బోజన సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, బయటి నుండి వచ్చిన పోలీసులకు వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎండీ రియాజ్, రాజారత్నం, డీఎస్పీ ఎన్. లింగయ్య, మహేష్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: రేపు విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ముఖ్య అంశాలివే..!

Just In

01

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

Jogipet hospital: జోగిపేట ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం.. హెల్త్ కమిషనర్ తనిఖీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Municipal Elections: పార్టీలకు మున్సిపల్ పరీక్ష.. అన్ని పార్టీలను దెబ్బతీస్తున్న సమస్య ఇదే!