CM Revanth Reddy: రండి.. తెలంగాణలో పాలుపంచుకోండి
CM Revanth Reddy (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

CM Revanth Reddy: రండి.. తరలిరండి తెలంగాణలో పాలుపంచుకోండి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ‘తరలి రండి.. ఉజ్జ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అనే నినాదంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Rising Global Summit)ను నిర్వహిస్తున్నది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్(Hyderabad) చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. తెలంగాణ ప్రగతి సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్‌ దిశగా తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పాలని సంకల్పించింది. వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఆహ్వన లేఖలను పంపిస్తున్నది.

Also Read: Vegetable Prices: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు.. సామాన్యుడు కొనేదెలా.. తినేదెలా..!

సీఎం ఆహ్వాన లేఖ ఇలా..

‘‘వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మా ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్ తెలంగాణకు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది. ఈ లక్ష్యాలను, మా ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తున్నాం. తప్పకుండా తరలిరండి’’ అనే ఆహ్వాన సందేశంతో ఈ లేఖలు పంపించారు. ప్రభుత్వం పంపించిన ఆహ్వానం అందుకున్న ప్రముఖుల్లో కొందరు సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించారు. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజవంశానికి చెందిన షేక్ తారిక్ అల్ ఖాసిమీ, రాస్ అల్ ఖైమా, డాయిచ్ బోర్స్ గ్రూప్ హెడ్ లుడ్విగ్ హెయిన్జెల్మాన్, ఎన్రిషన్ వ్యవస్థాపక భాగస్వామి డబ్ల్యూ విన్ స్టన్, మాండల్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ బెనెట్ నియోతో పాటు పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

మెస్సీ కిక్‌తో ముగింపు

రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఈ నెల 13న ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్‌కు రానున్నాడు. ఆయన పాల్గొనే వేడుకలోనే ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు ఇది ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలుస్తుంది.

Also Read: Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేకి హిట్ పడినట్టేనా? ఐరన్ లెగ్ ఇమేజ్‌ని బీట్ చేసిందా?

Just In

01

Rangareddy District: చనిపోయాడనుకొని మరచిపోయారు.. ఎనిమిదేళ్ల తర్వాత ప్రత్యక్షం.. రంగారెడ్డిలో ఘటన

Ind vs NZ 1st T20: తొలి టీ20లో టీమిండియా విధ్వంసం.. కివీస్‌ ముందు భారీ టార్గెట్!

Municipal Politics: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మైనంపల్లి హన్మంతరావు కీలక వ్యాఖ్యలు

Jogipet hospital: జోగిపేట ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం.. హెల్త్ కమిషనర్ తనిఖీలో బయటపడ్డ షాకింగ్ నిజాలు

Municipal Elections: పార్టీలకు మున్సిపల్ పరీక్ష.. అన్ని పార్టీలను దెబ్బతీస్తున్న సమస్య ఇదే!