Gadwal District: కొత్త వైన్స్ కు పంచాయతీ కిక్క
Gadwal District ( image Credit: Swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal District: కొత్త వైన్స్ కు పంచాయతీ కిక్క.. ఈ నెల మొత్తం ఎన్నికల మయం!

Gadwal District: ఇటీవల ఎక్సైజ్ శాఖ నిర్వహించిన టెండర్లలో వైన్ షాపులను దక్కించుకున్న నిర్వాహకులు నేటి నుంచి కొత్త షాపులను ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో కోలాహలం ఉంటుంది. కార్యకర్తల నుంచి బడా నాయకుల వరకు ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తారు. ఈ క్రమంలోనే తను వెంట వచ్చే అనుచరగణంతో పాటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ఖర్చకు ఎంతైనా వెనకాడని పరిస్థితి దాపురిస్తోంది.ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 34 వైన్ షాపులు ఉండగా వాటికి అనుబంధంగా గ్రామాలలో అనేక బెల్టు షాపులు విచ్చలవిడిగా అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడుతున్నాయి.

Also ReadWine Shops Closed: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. హైదరాబాద్‌‌లో మూడు రోజులు వైన్స్ బంద్..?

కొత్త మద్యం దుకాణాలు

డిసెంబర్ లోని మూడు దశల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్నారు అక్టోబర్ 27న 34 మధ్య షాపులను లక్కీ డ్రా నిర్వహించారు. డిప్ లో అదృష్టం వరించినవారు నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు.  మంచి రోజు కావడంతో కొందరు, నేడు మరికొందరు పూజా కార్యక్రమం నిర్వహించి వైన్స్ ను ప్రారంభించుకోనున్నారు.ఈ నెల 11, 14, 17న గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నడంతో మద్యం భారీగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డిసెంబర్ 31 న కూడా మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్తగా వైన్స్ లైసెన్స్ దక్కించుకున్న వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే అవకాశం

మళ్లీ జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇలా వ్యాపారం ప్రారంభంలోనే లక్షల్లో ఆదాయం రానుంది. దసరాకు మించి మద్యం కొనుగోలు కిక్కు ఉన్నట్లుగా అంతకుమించి రానున్న రోజులలో ఉంటాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రతి విడతకు వారం పాటు గడువు ఉండడంతో ఇప్పటినుంచే ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరి మద్దతు కూడగడుతున్నారు. ఓవైపు ఓటరు ఆకర్షించడం మరోవైపు తమ వెంట ఉండే అనుచరూలకు మద్యాన్ని కూడా ఆఫర్ చేస్తూ ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు.

Also Read: Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ దసరాకి నో ముక్కా, నో చుక్కా..!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!