Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలపై పార్టీల దృష్టి
Panchayat Elections (image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలపై పార్టీల దృష్టి.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు!

Panchayat Elections: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి రోజురోజుకీ ఊపందుకుంటోంది.గురువారం నుంచి నోటిఫికేషన్ జారీ కాగా తొలి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి పార్టీ ఎన్నికలు కానప్పటికీ సర్పంచులు భవిష్యత్తు రాజకీయాల్లో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నందున ప్రధాన పార్టీలు స్థానికంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దీంతో పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నాయి.

నిధులు సైతం ఎక్కువగా వచ్చే అవకాశం

ప్రధాన పార్టీల మద్దతుతో పోటీ చేస్తే ఆర్థిక వెసులుబాటు కలగడంతోపాటు నిధులు సైతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో ఆశావాహులు ముఖ్య నాయకుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు గ్రామాల వారీగా ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో పోటీకి ఎవరిని నిలిపితే బాగుంటుందని,గెలుపు అవకాశాలపై రాజకీయ, సామాజిక కోణాలలో అన్వేషణలో పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు. కొన్నిచోట్ల ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేస్తున్నాయి. ఇందుకు గ్రామాలు సామాజిక వర్గాల వారీగా పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలాబలాలపై ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డాయి. దీంతో పల్లె రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది

Also Read: Panchayat Elections: ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి.. ఏకగ్రీవాల కోసం వేలంపాటలు

అభ్యర్థుల కోసం అన్వేషణ

సర్పంచ్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు జరగనున్నడంతో పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థులను సర్పంచ్ లుగా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. జనరల్ స్థానాల్లో ఆర్థిక,అంగ బలం ఉన్న వారిపై దృష్టి సారించాయి. రిజర్వుడు స్థానాల్లో సామాజిక వర్గాల వారీగా గ్రామస్తులతో నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీలోని గెలిచే అవకాశం ఉన్న వారిని సైతం ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలలో చురుకుగా ఉండే యువ నాయకులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల్లో వారికున్న పలుకుబడి, విశ్వసనీయత అనే కోణాలలో దృష్టి పెడుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.ప్రస్తుతం జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఆయా పార్టీల క్యాడర్ లో పంచాయతీ పైనే చర్చలు జరుగుతున్నాయి. మరికొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కోసం అందరి ఆమోదయోగ్యంతో ఏకగ్రీవల సంఖ్య పెరుగుతూనే ఉంది.

2 ఏళ్ల తర్వాత ఎన్నికలు

సర్పంచుల పదవీకాలం పూర్తయి దాదాపు రెండేళ్లవుతుంది. పాలకవర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు అందాల్సిన ఎస్ ఎఫ్ సి ఎఫ్ ఏపీసి నిధులు పూర్తిగా నిలిచాయి. కొత్తగా పాలకవర్గాలు కొలువు తీరాక పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈసారి సర్పంచ్ గా బరిలో నిలిచేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతున్నారు . ఇందులో యువతే ఎక్కువ ఉంటున్నారు. రెండేళ్లుగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయో నామినేషన్ ఎప్పుడు వేద్దామా అన్నట్లుగా గ్రామాలలో పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల మధ్య ఉంటూ ఎదురు చూస్తున్నారు. దీంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఎంపిక పార్టీలకు తలనొప్పిగా మారింది. ఒకరిని ఎంపిక చేస్తే మరొకరు రెబల్ గా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో గ్రామంలోని ముఖ్య నాయకులతో సమావేశమై మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా అభ్యర్థి నిలిపేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు

ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు

సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవాలి అనుకునే అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతుండగా కొన్నిచోట్ల ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. గ్రామ పెద్దలు అభివృద్ధి విషయంలో ఐక్యంగా ఉన్నచోట తమకు అనుకూలమైన వ్యక్తిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. గ్రామానికి అభివృద్ధి పేరిట నగదు మాట్లాడుకుంటున్నప్పటికీ ఆ దిశగా అభివృద్ధి పనులను చేపట్టి మాట నిలుపుకుంటారా లేక పంచాయతీలలో పంచాయతీలకు కారణమవుతారా అన్నది భవిష్యత్తులో తేలనుంది.

Also Read: Panchayat Elections: స్థానిక పోటీపై పార్టీల్లో ఆశావహుల పావులు.. ఎమ్మెల్యేలు, మాజీ నేతలతో సంప్రదింపులు

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?