Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో వ్యతిరేకత
Etela Rajender (image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) మండిపడ్డారు. కమలాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయని ఇందుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో మరల అభివృద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం అని రాజేందర్ హితవు పలికారు. BRS పార్టీ అభ్యర్థులకు ప్రజల్లో మద్దతు లేకపోవడంతో వారిపట్ల గెలుపు అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు.

సర్కార్ ఎన్నికల ఏర్పాట్లపై మండిపాటు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం సరిగా పని చేయలేదని, నామినేషన్ దాఖలు ప్రక్రియలో సర్వర్లు పనిచేయక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థులు బయపడే పరిస్థితి. గ్రామాల్లో బతిలాడి నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు.

Also Read: Etela Rajender: హైదరాబాద్ ట్రాఫిక్ పై కేంద్ర మంత్రి గడ్కరీకి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి..!

కాంగ్రెస్‌పై విమర్శల వర్షం

కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కేసిందని రాజేందర్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ రకరకాల డ్రామాలు ఆడిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఖండించారు.

బీజేపీ విజయం లక్ష్యం

స్థానిక సంస్థల నిధులను ఖర్చు చేసే అవకాశం ప్రజల అభివృద్ధి పట్ల నిజాయతీ ఉన్న నాయకులకే కలగాలన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే ఎమ్మెల్యేగా గెలిచే బలం పెరుగుతుందని రాజేందర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రచారం చేస్తూ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రజలను ఓట్లు వేయమని కోరనున్నట్లు తెలిపారు. ప్రజలు మెచ్చిన అభ్యర్థులే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మా అభ్యర్థుల నిజాయితీ అభివృద్ధి ధ్యేయం చూసి హుజూరాబాద్ ప్రజలు ఓటు వేయాలి అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గంధసిరి రవికుమార్, బండి కళాధర్, పబ్బు సతీష్, తుమ్మ శోభన్ బాబు, మౌటం సంపత్, మార్క్ అశోక్, పిల్లి సతీష్ పాల్గొన్నారు.

Also Read: Etela Rajender: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ ఈటల రాజేందర్

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!