Local Body Elections: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల కోలాహలం!
Local Body Elections (imagecredit:swetcha)
మెదక్

Local Body Elections: మెదక్ ఉమ్మడి జిల్లా సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల కోలాహలం!

Local Body Elections: మెదక్ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ వేడి ప్రారంభమైంది. మెదక్(Medak) ,సిద్దిపేట(Sidhipeta), సంగారెడ్డి(Sangareddy), జిల్లాల్లో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లదుర్గం, రేగోడు, టెక్మాల్, హవేలీ ఘన్పూర్, పాపన్నపేట పెద్దశంకరంపేట, మండలాల్లో 160, గ్రామపంచాయతీలు , 1,402 వార్డు స్థానాలు కు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఉత్సాహంగా హాయ మండలాల్లో సర్పంచ్ వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేశారు.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లా లో మొదటివిడుత గా 1,639,సర్పంచ్,1,432 , వార్డు, స్థానాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ కోలాహలంగా ప్రారంభమైంది. గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గజ్వేల్,జగదేవ్ పూర్, మార్కుక్, ములుగు,రాయపోలు,వర్గల్ సిద్దిపేట డివిజన్లోని దౌల్తాబాద్ మండలాల్లో మొదటివిడుత సర్పంచ్ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read: Keerthy Suresh: పని గంటల గురించి బాంబ్ పేల్చిన కీర్తి సురేశ్.. వారు నిద్రపోయేది ఎన్ని గంటలంటే?

సంగారెడ్డి జిల్లాలో

సంగారెడ్డి జిల్లాలో మొదటివిడుత సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి,కంది,కొండాపూర్,సదాశివపేట, పటాన్చెరువు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లో నీ,136 గ్రామపంచాయతీ లు, 1,432,వార్డు స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి.ఆయా జిల్లాల్లో కలెక్టర్ లు రాహుల్ రాజ్,హైమావతి,ప్రావీణ్య లు పర్యవేక్షిస్తున్నారు.ఎన్నికల అబ్జర్వరులు సహితం ఆయా జిల్లాల్లో పర్యటించారు.కలెక్టర్ లతో పాటు ఎన్నికల పరిశీలకులు ,సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల, నామినేషన్ల దాఖలు ,ప్రక్రియను పరిశీలించారు.ఇదిలా ఉండగా మెదక్ జిల్లాలో మొత్తం,492 గ్రామ పంచాయతీలు ఉండగా,4220,వార్డులు ఉన్నాయి.సిద్దిపేట జిల్లా లో 508 గ్రామ పంచాయతీ లు ఉండగా,4,508 వార్డులు ఉన్నాయి,సంగారెడ్డి జిల్లాలో 613,గ్రామ పంచాయతీలు ఉండగా,5,370 వార్డులు ఉన్నాయి. వీటికి.3 విడతలుగా డిసెంబర్,11న మొదటి విడత ఎన్నికలు,14, న రెండవ విడత,ఎన్నికలు,17 న మూడవ విడత సర్పంచ్ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లా ఎస్పీలు, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.

Also Read: Hong Kong Fire Accident: హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. ముగ్గురు అరెస్టు

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?