Ex Sarpanch Death Case: పాత్రదారులు ఎవరు?, సూత్రదారులు ఎవరు?
కొనసాగుతున్న పోలీసుల వేట
వారే హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోణలు
మూడు నెలల ముందే సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం?
రాజకీయ, వ్యాపార, భూతగాదాలే హత్యకు దారితీశాయా?
పోలీసుల అదుపులో నిందితులు?
నందిన్నె మాజీ సర్పంచ్ మృతి కేసులో వేగంగా విచారణ
గద్వాల,స్వేచ్ఛ: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం జాంపల్లి వద్ద శుక్రవారం జరిగిన అనుమానాస్పద రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కేటిదొడ్డి మండలం నందిన్నె మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు మృతి (Ex Sarpanch Death Case) చెందారు. అయితే, అనుమానాస్పద మృతి కావడం, హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. కేసు చిక్కుముడి వీడుతున్నట్లేనని పోలీసులు భావిస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారులెవరన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధమున్న కీలక నిందితులు ఇంకా పరారీ ఉన్నట్టు గుర్తించినట్టుగా సమాచారం. వారు దొరికితే మొత్తం చిక్కుముడి వీడిపోతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, ఘటన జరిగి ఐదు రోజులవుతోంది. జిల్లా వ్యాప్తంగా సంచలనం కావడంతో పోలీసు యంత్రాంగం ఈ కేసుపై దృష్టిసారించింది.
పరారీలోనే నిందితులు
మాజీ సర్పండ్ మృతి కేసులో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రధాన పాత్రధారిగా గుర్తించినట్టుగా తెలిసింది. బైక్‌పై వెళ్తున్న నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్నభీమరాయుడును బొలేరో వాహనం ఢీకొట్టడంతో చనిపోయారు. అయితే, అదే రోజు రాత్రే ప్రధాన సూత్రదారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయతే, ఈ కేసులో నిందితులకు షెల్టర్ ఇచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ప్లాన్ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన పాత్రధారి మాత్రం పరారిలో ఉన్నట్లు, ప్రధాన వ్యక్తి పట్టుబడితే అన్నీ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అంతా తెలిసిన వారే!
సూత్రదారులు, పాత్రధారులు అంతా చిన్న భీమరాయుడుకు తెలిసిన వ్యక్తులేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతో భూవివాదాలు, రాజకీయ, వ్యాపార విషయాల్లో అడ్డుస్తున్నవారేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరి పాత్ర ఎంత? అన్న అంశంపై వివరాలు సేకరిస్తున్నారు.
అనుమానాలు, ఆరోపణలు ఇవే
చిన్న భీమరాయుడు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్లాన్‌తో బొలేరో వాహనంతో ఢీకొట్టి చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట అందరూ రోడ్డు ప్రమాదమేనని భావించినప్పటికీ, ఆ తర్వాత మర్డర్ అనే అభిప్రాయాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాలలో పనులు ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, బోలేరో వాహనం ఢీకొట్టి దాదాపుగా 250 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే బొలేరో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఢీకొట్టిన వాహనం ఏపీలోని కర్నూల్‌కు చెందినదిగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా భీమరాయుడు కదలికలపై సుపారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యకు ఓ రైస్ మిల్ నిర్వాహకుడే కారణమంటూ ఆ మిల్లు ముట్టడికి మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
Read Also- Bandi Sanjay: ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి 50 లక్షల వైద్య పరికరాలు ప్రారంభం : కేంద్ర మంత్రి బండి సంజయ్

