Kim hanged one man in N. Koria
అంతర్జాతీయం

International news:కిమ్ అరాచకం

  • దక్షిణ కొరియా పాటలు విన్నాడని బహిరంగంగా ఉరి
  • మితిమీరిపోయిన కిమ్ నియంతృత్వ ధోరణి
  • దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన వ్యక్తికి కఠిన శిక్ష
  • శతృదేశాలకు చెందిన సినిమాలు, పాటలపై నిషేధం
  • మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని దక్షిణ కొరియా ఆరోపణ
  • ఆరోపణలను ఖండించిన ఉత్తర కొరియా

South Korea’s unification ministry released Report on North Korean Human Rights
ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్ ఉన్ ప్రజల విషయంలో చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఆ దేశంలో శత్రు దేశాల గురించి మంచిగా మాట్లాడటం కానీ, వారి సంస్కృతిని పాటించడం కానీ చేసినట్లయితే కఠినంగా శిక్షిస్తారు. ఈ క్రమంలో దక్షిణ కొరియాకు చెందిన పాటలు విన్నాడని, ఆ దేశ సినిమాలు చూశాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరి తీసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇటీవల దక్షిణ కొరియా ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో ఉత్తర కొరియా మానవ హక్కుల గురించి వెల్లడించింది. ఈ నివేదికలో పేర్కొన్న దాని ప్రకారం, 2022లో దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన 22 ఏళ్ల వ్యక్తి 70 దక్షిణ కొరియా పాటలు విన్నాడని, అలాగే, ఆ దేశానికి చెందిన 3 సినిమాలు చూశాడని, వాటిని ఇతరులకు షేర్ చేశాడని, అతన్ని బహిరంగంగా ఉత్తర కొరియా ఉరితీసింది. ఉత్తర కొరియా తన పౌరులు వినియోగించే సమాచారంపై ఎల్లప్పుడు నిఘా వేస్తూ, కఠినమైన నియంత్రణ కలిగి ఉంది.

కఠిన శిక్షలు

శుత్రు దేశాలకు చెందిన సినిమాలు, పాటలు ఇతర ఎంటర్‌టైన్‌మెంట్, పాశ్చాత్య సంస్కృతి వినియోగానికి సంబంధించి కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే చాలా కఠినమైన శిక్షలు వేస్తారు.మరోవైపు దక్షిణ కొరియా పేర్కొన్న మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. ఆ దేశం కావాలనే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని, మా నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియాలో పాశ్చాత్య సంస్కృతిపై నియంత్రణ అనేది మాజీ నాయకుడు కిమ్ జోంగ్-ఇల్ ఆధ్వర్యంలో ప్రారంభం కాగా, ఆ తర్వాత ఆయన కుమారుడు కిమ్ జోంగ్-ఉన్ ఆధ్వర్యంలో మరింత తీవ్రమైంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!