Maoists: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టుల లేఖ..
Maoists ( image CREDIT: twitter)
జాతీయం

Maoists: ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టుల లేఖ.. ఆయుధ విరమణకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి!

Maoists: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సోను దాదా నిర్ణయానికి మద్దతును ప్రకటిస్తూ మావోయిస్టు ప్రతినిధి పేరిట ఓ లేఖను విడుదల చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్,ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి విజయ్ శర్మ లకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు అభ్యర్థిస్తూ ఓ లేఖను విడుదల చేశారు. దేశంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, ఆయుధాలను వీడి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని మా కేంద్ర కమిటీ పార్టీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు సోనూ దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ఏకమై ఆయుధ విరమణకు సంసిద్ధులయ్యామని పేర్కొన్నారు.

మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి

కేంద్ర కమిటీ సభ్యుడు సతీష్ దాదా, మరో కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ చంద్రన్న ఇటీవలనే ఈ నిర్ణయాన్ని సమర్థించారని తెలిపారు. మేము ఎం ఎం సి స్పెషల్ జోనల్ కమిటీ కూడా ఆయుధాలను త్యజించి ప్రభుత్వ పునరావాసం, ఉపాధి మార్గాల కోసం అనుసరించే ప్రణాళికలను అంగీకరించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మా పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని సమిష్టిగా అంగీకరిస్తూ కొంత సమయం కావాలని వేడుకున్నారు. ఆయుధ విరమణ చేసేందుకు ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థించారు. ఈ మధ్యకాలంలో పార్టీ అంతా ఏకమై సమిష్టి నిర్ణయానికి వచ్చి ఆయుధ విరమణను పూర్తిగా విడిచి పెట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటామని విజ్ఞప్తి చేశారు.

Also ReadMaoists News: కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. మావోయిస్టుల పని అయిపోయింది అనుకున్నారా..!

సహసోపేత నిర్ణయాలకు తాము సిద్ధం

పార్టీ ఎంత కమ్యూనికేట్ చేసుకోవడానికి వేరే సులభమైన మార్గాలు లేనందున ఈ సమయం ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయం ఎక్కువే కావచ్చు కానీ మేమంతా ఏకతాటిపై రావడానికి సమయం అవసరం పడుతుందని కోరారు. కేంద్ర ప్రభుత్వం విధించిన మార్చి 31, 2026 నేపథ్యంలో తమంత ఒక్క తాటిపైకి వచ్చి సరైన నిర్ణయం తీసుకునేందుకు ఈ సమయం అవసరం పడుతుందని విజ్ఞప్తి చేశారు. రాబోయే పి ఎల్ జి ఏ వారోత్సవాలను సైతం నిర్వహించం అతి త్వరలో రాబోయే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలను సైతం తమ పార్టీ నిర్వహించకూడదని నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టం చేశారు. పార్టీ ఉన్న ఒడిదుడుకల కారణంగా ఎలాంటి సహసోపేత నిర్ణయాలకు తాము సిద్ధంగా లేవని వివరించారు. ప్రతి ఏడు నిర్వహించే వారోత్సవాలను సైతం నిలిపివేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సుముఖంగా ఉన్నామని వెల్లడించారు.

పార్టీ ఎలాంటి అవాంఛనీయ ఘటన

ఈ క్రమంలో ఎలాంటి ఆపరేషన్ కూడా నిర్వహించకూడదని ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిపారు. ఇకపై మావోయిస్టు పార్టీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కార్యాచరణ రూపొందించకుండా సైలెంట్ గా ఉండేందుకే సుముఖంగా ఉన్నామని వివరించారు. ఈ సమయంలోగా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులను కలిసే అవకాశాన్ని మాకు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే సామూహికంగా ఆయుధాలను విడిచి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్టమైన తేదీని ప్రకటించేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. అయితే పేర్కొన్న తేదీ వరకు భద్రతా దళాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసి, ప్రభుత్వం ఈ ప్రక్రియకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఇది సాధ్యమవుతుందని వేడుకొన్నారు.

ఆయుధ విరమణ ప్రకటనను స్పష్టంగా వెల్లడి

ప్రభుత్వ ప్రతిస్పందన కోసం తాము ఎదురుచూస్తామని వెల్లడించారు. రాబోయే అతికొద్ది రోజుల్లో మా ఆయుధ విరమణ ప్రకటనను స్పష్టంగా వెల్లడించేందుకు సుముఖంగా ఉంటామని వివరించారు. ప్రజాస్ఫూర్తి గల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులు మాకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు మధ్యవర్తిత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు వారు సామరస్యంగా చర్చలు జరిపేందుకు నమ్ముతున్నామని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్రలో చేసినట్లుగానే ఎమ్మెల్సీ జోన్లో కూడా అదే పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Maoists Arrest: ఏపీలో మావోయిస్టుల కలకలం.. ఏకంగా 31మంది అరెస్ట్.. పట్టించిన హిడ్మా డైరీ

Just In

01

CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. ఓ ఉపాద్యాయుడి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

Medaram Jatara: మేడారం జాతర పనుల పురోగతిపై మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ..!

Chevella Municipality: మున్సిపల్ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ పోటీ.. అందరి చూపు అటువైపే..!

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!