Maoists News: కేంద్ర ప్రభుత్వం, చత్తీస్గడ్ రాష్ట్రం తో పాటు ఇతర రాష్ట్రాల భద్రత బలగాలు, పోలీస్ అధికారులు మావోయిస్టు పని మొత్తం అయిపోయింది అనుకున్నారు. కానీ ఇంకా మిగిలే ఉంది అని నిరూపించేందుకు హిడ్మా(Hidma) అనుచరుడు బర్సి దేవా(Barsi Deva) రంగంలోకి దిగాడు. హిడ్మా స్థానంలో మ్యాన్ పవర్ పెంచుకుంటూ వారికి ట్రైనింగ్ ఇస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అంతా అయిపోయింది అనుకున్న పోలీసులకు ఇంకా మావోయిస్టు సినిమా మిగిలే ఉందని నిరూపించేందుకు మావోయిస్టు పార్టీ తన కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది.
సిద్ధమవుతున్నారా..?
ఆపరేషన్ కగార్‌లో భాగంగా చత్తీస్గడ్, కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాష్ట్రాల భద్రత బలగాలు అతి పవర్ఫుల్ భద్రత విభాగం కోబ్రా(Kobra), ఆక్టోపస్(Octopus), గ్రేహౌండ్స్(Greyhounds), సిఆర్పిఎఫ్(CRPF) వంటి విభాగాల పోలీసులు మావోయిస్టులను మట్టు పెట్టి గట్టిగానే పార్టీని దెబ్బ కొట్టారు. హిడ్మా ఎన్కౌంటర్ తో అంతా అయిపోయింది అనుకున్న మావోయిస్టులు మళ్ళీ రెచ్చిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే హిడ్మా ను మట్టు పెట్టిన పోలీసులపై గట్టి రివెంజ్ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారా..? అంటే నిజమే అనిపిస్తోంది.
Also Read: Kolkata earthquake: కోల్‌కతాలో భూకంపం.. క్రికెట్ ఆడుతుండగా ఊగిపోయిన స్టేడియం.. వీడియోలు వైరల్!
హిడ్మా అనుచరుడు దేవా
దేవిజి, ఆజాద్ ఎక్కడో తెలియదు కానీ హిడ్మా అనుచరుడుగా ఉన్న దేవా(Deva) మాత్రం ఆయన అడుగుజాడల్లో మ్యాన్ పవర్ ను పెంచుకుంటూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీంతో మావోయిస్టు పార్టీ పునర్జీవం సంతరించుకుంటుందా అనే ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్ జి, మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ లు మారేడుమిల్లి ఎన్కౌంటర్ ల తర్వాత ఎక్కడ ఉన్నారో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా తెరపైకి బర్సి దేవా రావడం అందర్నీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. మరి మావోయిస్టుల పూర్వ వైభవం సంతరించుకుంటుందా..? లేదంటే తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తుందా.. తెలియాల్సి ఉంది. అయితే దేవా అలియాస్ హంగా పి ఎల్ జి ఏ మొదటి కమాండర్ గా బాధ్యతలు స్వీకరించి మ్యాన్ పవర్ను పెంచుకొని శిక్షణ ఇస్తున్నట్లుగా ఓ వీడియో బయటకు రావడం గమనార్హం.
Also Read: Kalvakuntla Kavitha: ఆర్ఆర్ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీసర్వే చేయాల్సిందే.. కవిత అల్టిమేటం!
