Bus Accident: ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు
Bus Accident (Image Source: Twitter)
జాతీయం

Bus Accident: జర్నీ మూవీ సీన్ రిపీట్.. ఎదురెదురుగా ఢీకొన్న బస్సులు.. పలువురు స్పాట్ డెడ్

Bus Accident: దేశంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు.

తమిళనాడులోని టెంకాసి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మదురై నుండి శెంకొట్టైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. టెంకాసి నుండి కోవిల్‌పట్టికి వెళ్తున్న మరో బస్సును ఇడకల్ ప్రాంతం వద్ద బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనాస్థలి మెుత్తం భీతావాహంగా మారిపోయింది.

Also Read: Gang Wars – Sajjanar: హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్స్.. రంగంలోకి సజ్జనార్.. రౌడీలకు మాస్ వార్నింగ్!

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్.. క్షతగాత్రులను కాపాడి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మదురై నుంచి శెంకొట్టైకి వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బస్సు ప్రమాదంపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ‘బస్సు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి నాణ్యమైన చికిత్స అందేలా చూడాలని సూచించాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు.

Also Read: Ayodhya: 100 టన్నుల పూలతో ముస్తాబైన అయోధ్య.. మంగళవారం రామ మందిరంలో జెండా ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

Just In

01

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?