Gadwal Sand Supply: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక సరఫరా లేక గత 40 రోజులుగా ఆగిపోయిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎట్టకేలకు కలెక్టర్ చొరవతో రాజోలి మండలం తుంగభద్ర ఇసుక రీచ్ నుంచి సరఫరా ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్(Collector Santosh Kumar) జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఎంపిక పూర్తి కాగా, లక్ష్యం మేరకు వాటి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో నిర్మాణాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలోపరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష చేపడుతున్నారు.
నేటికీ అందుబాటులో లేని ఆన్ లైన్ బుకింగ్
గత రెండు నెలలుగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఇసుక బుక్ చేసుకునేందుకు టీజిఎండిసి వెబ్ సైట్(TGMDC website) లో బుక్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాకపోవడంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులు మందకోడిగా సాగగా ప్రస్తుతమైన చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇంటి నిర్మాణదారులు శత విధాల ప్రయత్నిస్తున్నా అందుకు అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఇసుక టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ స్థానిక అధికార పార్టీ నాయకుడితో డీల్ కుదరకపోవడంతో స్థానిక నాయకులు టిప్పర్లను నిలిపి వేయించిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక కొరత సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో ఆయనే ప్రత్యేకంగా చొరవ చూపి రీచ్ నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా గత నాలుగు రోజుల నుంచి సరఫరా అయ్యేలా పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S EV వచ్చేస్తోంది.. రిలీజ్‌కు ముందే లీకైన ఫీచర్స్
అక్రమంగా పంచలింగాల టు గద్వాల్
అలంపూర్ టోల్ గేట్ కు సమీపంలోని పంచలింగాల దగ్గర అక్రమంగా తుంగభద్రా నదిలో ఇసుకను తరలించి టిప్పర్ల ద్వారా గద్వాల(Gadwala)కు రవాణా చేస్తూ 50 వేల దాకా గృహనిర్మాణదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందుకు అక్కడి స్థానిక ఎంపీ కుమారుడి ప్రోత్సాహంతో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా డిపార్ట్ మెంట్ల వారీగా అంగీకారానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.అదేవిధంగా పెబ్బేరు సమీపంలోని రామాపురం నుంచి సైతం మరికొందరు ఇసుక అక్రమార్కులు జిల్లా కేంద్రానికి రాత్రి వేళల్లో అధిక సంఖ్యలో అధిక లోడుతో టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తూ అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తోంది. ఇలా అక్రమంగా డీల్ లో లేని టిప్పర్ ను గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. టీజీఎండిసి ద్వారా ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఇసుక లభించినట్లయితే గృహ వినియోగదారులకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని గృహనిర్మాణదారులు కోరుతున్నారు.
Also Read: VrushaKarma Movie: నాగచైతన్య ‘NC24’ టైటిల్ వచ్చేసింది.. ఏం పవర్ ఉంది గురూ టైటిల్..

