Warangal District: రేషన్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు(Food security card)లపై ముఖ్యమంత్రి, పౌర సరఫరా శాఖ మంత్రుల ఫోటోలు పెట్టడం సాధారణ విషయం. ఇటీవలే ప్రధాన మంత్రి(PM) ఫోటో పెట్టాలి అనేది కొత్తగా బీజేపీ(BJP) నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే వరంగల్(Warangal) జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఇంకో అడుగు ముందుకు వేసి ఫుడ్ సెక్యూరిటీ కార్డు పై ఎమ్మెల్యే(MLA), కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఫోటోతో కార్డు తయారు చేసి పంపిణీ చేశారు. ఈ విచిత్ర ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి(Parvatha Giri) మండలం గోపనపల్లిలో చోటు చేసుకుంది.
Also Read: Football Stadium: క్రీడాకారులకు గుడ్ న్యూస్.. సిటీలో రెండు ఫుట్ బాల్ స్టేడియాలు
ప్రతిపక్షాలు డిమాండ్..
ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు(MLA Nagaraju) ఫోటో, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఫోటోతో ప్రైవేట్ రేషన్ కార్డును కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోటోలతో ముద్రించిన రేషన్ కార్డుల పంపిణీ పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికార యంత్రాంగం దీనిపై స్పందించడం లేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ రేషన్ కార్డులు ప్రింట్ చేసి పంపిణీ చేసిన గోపనపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నాగార్జున పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలుడిమాండ్ చేస్తున్నాయి.
Also Read: Vijay Deverakonda: సత్యసాయి బాబాతో తన చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకున్న విజయ్ దేవరకొండ.. ఫోటో వైరల్..
