Balram Naik: కార్మికుల ఫిర్యాదులకు ప్రత్యేక వాట్సప్ నంబర్‌
Balram Naik (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Balram Naik: కార్మికుల ఫిర్యాదులకు ప్రత్యేక వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం : సీఎండీ బలరాం నాయక్

Balram Naik: సింగరేణి కార్మికుల ఫిర్యాదులు, సమస్యలను మరింత వేగంగా స్వీకరించి పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ప్రత్యేక వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ సీఎండీ బలరాం నాయక్ తెలిపారు.  ‘డయల్ యువర్ సీఎండీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి సింగరేణిలోని దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిన సమయంలో అనుమతులు వేగంగా జారీ అయ్యేలా, వైద్య సేవల విషయంలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని సీఎండీ ప్రకటించారు.

Also Read: Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్.. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో ఎంపిక!

సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు

అంతేకాకుండా, సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్‌లో కార్పొరేట్ ఆస్పత్రిని ఏర్పాటు చేయబోతున్నామని, రామగుండం ఏరియాలో క్యాథ్ ల్యాబ్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలపై, సంస్థలో ఉత్పత్తి పెంపుపై ఉద్యోగులు ఇచ్చిన సలహాలు, సూచనలు బాగున్నాయని సీఎండీ అభినందించారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంపుదలపై ఇచ్చిన సూచనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్‌లో ఆదేశించారు.

ఉద్యోగుల క్వార్టర్లలో సౌకర్యాల పెంపు

ఈపీ-ఫిట్టర్ల పదోన్నతులు, ఉద్యోగుల క్వార్టర్లలో సౌకర్యాల పెంపు వంటి అంశాలపై చర్చించి పరిష్కరిస్తామన్నారు. అలాగే, ఈ నెలలో మెడికల్ బోర్డును నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు ఉంటుందని చెప్పినప్పటికీ, కార్మికుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో కార్యక్రమాన్ని 6 గంటల వరకు కొనసాగించారు. గైర్హాజరయ్యే ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని తోటి ఉద్యోగులకు సీఎండీ సూచించారు.

Also Read: Terrorist Arrest: దేశంలో దాడులు చేసేందుకు టెర్రరిస్టుల ప్లాన్.. అరెస్ట్ చేసిన పోలీసులు

Just In

01

Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..

Madhira Municipality: మధిర మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క

VT15 Title Glimpse: వరణ్ తేజ్ ‘VT15’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..

Champion Movie: ‘ఛాంపియన్’ సూపర్ హిట్ సాంగ్ ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..

Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..