GHMC Tax Collection: ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన బల్దియా..!
GHMC Tax Collection (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC Tax Collection: ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన బల్దియా.. వసూలు చేయకుంటే జీతాలు లేవని స్పష్టీకరణ

GHMC Tax Collection: గ్రేటర్ హైదరాబాద్ మహానగరాభివృద్దితో పాటు అత్యవసర సేవల నిర్వహణ బాధ్యతలను మోస్తున్న జీహెచ్ఎంసీ(GHMC)లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ సమస్య నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ఉన్నతాధికారులు ట్యాక్స్ స్టాఫ్ కు టార్గెట్ @ రూ.300 కోట్లు అనే టాస్క్ ను ఇచ్చింది. ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్(Property Tax Collection) ను పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్దమయ్యారు. గడిచిన అయిదారు ఏళ్ల నుంచి ప్రతి నెల జీతాలు, పెన్షన్లు కూడా చెల్లించేందుకు అష్టకష్టాలు పడుతున్న జీహెచ్ఎంసీ కొద్ది రోజుల క్రితం వరకు సిటీలోని అన్ని సర్కిళ్లలో కలిపి నెలకు రూ. వంద కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనన్న నిబంధనను అమలు చేస్తూ వచ్చారు.

లక్ష్యం ప్రకారం ట్యాక్స్ కలెక్షన్..

ఇపుడు తాజాగా ఈ నిబంధనను సవరించి సిటీలోని ప్రతి సర్కిల్ నెలకు రూ. 10 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనన్న నిబంధనను అమలు చేస్తున్నారు. సర్కిల్ లో విధులు నిర్వర్తించే ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన టార్గెట్ ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. లక్ష్యం ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ చేయని పక్షంలో జీతాల చెల్లింపులు ఉండవన్న విషయాన్ని కూడా ట్యాక్స్ స్టాఫ్ కు స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు 24 వేల మంది ఔట్ సోర్స్ ఉద్యోగులు, మరో మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు జీతాలతో పాటు పెన్షనర్లకు పెన్షన్ లను చెల్లించేందుకు నెలకు రూ. 136 కోట్ల అవసరమవుతున్నాయి. దీంతో పాటు మరో వంద కోట్ల రొటీన్ మెయింటనెన్స్ తో కలిసి ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీకి నెలకు రూ. 300 కోట్ల వరకు నిధులు అవసరమవుతుండగా, ఈ మొత్తం సమకూర్చేందుకు అధికారులు ట్యాక్స్ వింగ్ పైనే పూర్తి గా ఆధారపడి సరి కొత్త టార్గెట్లు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఫిక్స్ చేసిన కలెక్షన్ టార్గెట్లు డిసెంబర్, జనవరి మాసాల వరకు కొనసాగించి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మరింత పెంచే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: MLA Kadiyam Srihari: ఆ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ పై సర్వత్రా ఉత్కంఠ.. ఉప ఎన్నిక ఖాయమా..?

నెల ముందు నుంచే కలెక్షన్ పై ఫోకస్ 

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఈ సారి అధికారులు నెల రోజుల ముందు నుంచే ఫోకస్ పెట్టనున్నారు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం జనవరి మాసం నుంచి మార్చి నెలాఖరు కల్లా కలెక్షన్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించే ట్యాక్స్ వింగ్ అధికారులు ఈ సారి డిసెంబర్ మాసం నుంచే కలెక్షన్ పై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో నెలకున్న ఆర్థిక సంక్షోభం, వేల కోట్లలో పేరుకుపోతున్న మొండి బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మాసం నుంచే నోటీసులను జారీ చేస్తూ, కలెక్షన్ ఫీల్డు స్టాఫ్ అయిన బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లను పరుగులు పెట్టించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 1426 కోట్ల వసూలు కాగా, ఈ సంవత్సరం టార్గెట్ గా రూ. 2500 కోట్ల కలెక్షన్ పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.1426 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ కాగా, టార్గెట్ కు మిగిలిన రూ. 1074 కోట్లను రానున్న మార్చి నెలాఖరు కల్లా కలెక్షన్ చేసుకునేందుకు అధికారులు వ్యూహాం సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల వరకు మొండి బకాయిలున్నా, వీటిపై స్పెషల్ గా ఫోకస్ చేసి 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, మరో 323 మంది బిల్ కలెక్టర్లకు భారీ టార్గెట్లు ఇస్తే, కనీసం రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల మధ్య ఈ బకాయిలు వసూలవుతాయని అధికారులు అంఛనాలేస్తున్నారు.

Also Read: Sridhar Babu: గత ప్రభుత్వంలోనే ఆర్థిక అరాచకం.. కేటీఆర్‌‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!