Sridhar Babu: గత ప్రభుత్వంలోనే ఆర్థిక అరాచకం. శ్రీధర్ బాబు
Sridhar Babu ( image CREDit: swetcha reporter)
Political News

Sridhar Babu: గత ప్రభుత్వంలోనే ఆర్థిక అరాచకం.. కేటీఆర్‌‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం

Sridhar Babu: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి వెళ్లిపోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అయినా కేటీఆర్ ఆలోచనల్లో మార్పు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని రూ.5 లక్షల కుంభకోణంగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జీఓలు ఇచ్చిందని, వారి ప్రభుత్వ పాలనలో కాదా అని ఆయన ప్రశ్నించారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడారు. కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు.

మాటకు మాట

కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4,740 ఎకరాలేనని, మిగిలిన భూమి రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించామని శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేటాయింపులు ఒక్క రోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవన్నారు. ఆజామాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కూకట్ పల్లి, ఆజామాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్‌మెంట్, జీఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29న జారీ చేశారని వివరించారు. ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామని, 30, 50 శాతం స్లాబులతో ఇంపాక్ట్ ఫీజు నిర్ణయిస్తూ ఈ నెల 17న జరిగిన క్యాబినెట్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.

Also Read: Minister Sridhar Babu: సక్సెస్ సాధించాలంటే.. టెక్నాలజీని సొంతం చేసుకోవాల్సిందే..!

2023లో ఎంత వసూలు చేశారు?

2023లో ఎన్నికలకు 4 నెలల ముందు ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించారని, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఆ జీఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓటమితో కేటీఆర్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని, వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని, ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి పాలనలోనే జరిగి ఉండాలని, పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జీఓలు ఇచ్చారన్నారు.

ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలన్నారు. వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే తాము కల్పించామన్నారు. అగ్రిమెంట్లు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారని, కేటీఆర్ చెబుతున్న వారెవరూ ప్రభుత్వంలో లేరన్నారు. పదేండ్లు మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమీ చేయాలో అది చేస్తుందన్నారు. కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోలేరని తెలిపారు.

కేటీఆర్.. గాలి మాటలు మానుకో..

రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండి కొట్టాలని చూడడమే బీఆర్ఎస్ ప్రధాన కర్తవ్యంగా మారిందని శ్రీధర్ బాబు అన్నారు. ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కన్వర్షన్‌కు భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ అవ్వకుండా బీఆర్ఎస్ అడ్డు పడుతున్నదన్నారు. సొంత భూములు ఉన్న వాళ్లు కన్వర్షన్ చేసుకోవచ్చని అన్నారు. కేటీఆర్ గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఫ్రీ హోల్డ్, లీజ్ ల్యాండ్ మధ్య పొంతన లేకుండా మాట్లాడారని కౌంటర్ ఇచ్చారు.

Also Read: Sridhar Babu: ఏఐతో పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Just In

01

Sankranti Safety Alert: పతంగులు ఎగురవేస్తున్నారా? జర భద్రం.. విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ కీలక సూచనలు!

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

Mega Blockbuster: సంక్రాంతికి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’..

Rahul IAS: తన వెడ్డింగ్ కార్డ్ నే కాదు.. ఇప్పుడు కొడుకు పేరున రిలీజైన త్రీడీ వీడియో రివ్యూ నెట్టింట వైరల్.. ఎవరా ఐఏఎస్ ఆఫీసర్?

Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ