Sridhar Babu: ఏఐతో పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువ.
Sridhar Babu (image credit: swetcha reporter)
Telangana News

Sridhar Babu: ఏఐతో పోయే ఉద్యోగాల కంటే వచ్చేవే ఎక్కువ.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్

Sridhar Babu: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహేనని, అది ఉద్యోగాల స్వరూపాన్ని మాత్రమే మారుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. ‘స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ) లో నిర్వహించిన స్కిల్ కాన్వకేషన్ ఇన్ ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ అండ్ ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్ హ్యాకాథాన్ 2025ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

టెక్నాలజీ వేగంగా మారుతోంది

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌లో తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీ వేగంగా మారుతోందని, ఆ మార్పులను అందిపుచ్చుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుందని మంత్రి యువతకు సూచించారు. రెండేళ్లలోనే 40 శాతానికి పైగా అంతర్జాతీయ కంపెనీలు జనరేటివ్ ఏఐను తమ కోర్ వర్క్‌లో భాగం చేసుకున్నాయని గుర్తు చేశారు.

Also Read: Minister Sridhar babu: ఏఐతో ఉద్యోగాలు పోతాయా.. ఇది కేవలం అపోహే: మంత్రి శ్రీధర్ బాబు

భారీ డిమాండ్

ఏఐ ప్రభావంపై ఆయన మాట్లాడుతూ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదికను ఉటంకించారు. ఆటోమేషన్ వల్ల 85 మిలియన్ల ఉద్యోగాలు పోయినా, కొత్తగా 97 మిలియన్ల స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తేల్చిందని వివరించారు. సంక్షోభంతో పాటే కొత్త అవకాశాలు వస్తాయని, అందుకు యువత సంసిద్ధంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, ఎథికల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతోందని మంత్రి పేర్కొన్నారు.

అలాగే, వాతావరణ మార్పుల కారణంగా క్లీన్ టెక్, ఈవీలు, గ్రీన్ ఇన్నోవేషన్ రంగాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. అయితే, ఈ డిజిటల్ యుగంలో కేవలం అకడమిక్ డిగ్రీలతో మాత్రమే ఉద్యోగాలు రావని, ఇన్నోవేషన్, ప్రాబ్లం సాల్వింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే సక్సెస్ సాధ్యమని యువతకు దిశానిర్దేశం చేశారు. తమ ప్రభుత్వం కేవలం భవిష్యత్తును ఊహించడం కాదని, దానికి అవసరమైన స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తోందని, రెడీ టూ వర్క్ ఫోర్స్‌ను తయారు చేసే బాధ్యతను భుజానికెత్తుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసీ డైరెక్టర్ డా. రామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Duddilla Sridhar Babu: ఐటీ ఫార్మా క్రీడల్లో సహకారానికి తెలంగాణ సంసిద్ధం.. క్యూబా రాయబారితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Just In

01

Black Jaggery: ఆ జిల్లాలో జోరుగా నల్లబెల్లం దందా.. 100 క్వింటాళ్లు దొరికిన వారిపై పోలీసుల చర్యలు ఏవి?

Gadwal District: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. పట్టుకుని వదిలేసిన పీడిఎస్ బియ్యం వాహనం ఎవరిది?

Khammam Municipal Elections: ఎదులాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధం.. 10 ఏళ్ల ప్రత్యేక అధికారి పాలనకు ముగింపు?

Medaram Jatara 2026: మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్.. మూడు కోట్ల భక్తుల కోసం సమగ్ర ప్రణాళిక!

Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?