MLA Kadiyam Srihari: జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల తరువాత మరోసారి ఉప ఎన్నికలు వస్తాయనే చర్చ సాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయి అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా సాగుతుంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడు జిల్లాకు సంబంధించి సీనియర్ నేత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) అంశం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న కున్న తరువాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే చర్చ సర్వత్ర సాగుతుంది. ముఖ్యంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పొలిటికల్ ఫ్యూచర్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
శ్రీహరికి నోటీసులు
పార్టీ ఫిరాయింపు పై సమాధానం ఇవ్వాలని మరోసారి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని స్పీకర్ నోటీసులో పేర్కొన్నారు.
Also Read: Raju Weds Rambai review: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రేమకథ ప్రేక్షకులను మెప్పించిందా?.. ఫుల్ రివ్యూ..
ఉపఎన్నికలు వస్తాయా?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్ పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారి ఎన్నికలను రద్దు చేస్తారా…? అసలు ఎన్నికలు వస్తాయా…? ఎన్నికలు వస్తే కడియం ప్లాన్ ఏంటి అని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. నోటీసుపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న కడియం శ్రీహరి ఇప్పటికే నోటీసుల వ్యవహారంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం. న్యాయనిపుణుల సలహాల తర్వాత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు కడియం సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతుంది.
ఇదే చివరి పోటీ అన్న కడియం ఉప ఎన్నిక వస్తే ఏం చేస్తారు..?
2023 లో జరిగిన సాధారణ ఎన్నికలే నాకు చివరి ఎన్నికలు అని చెప్పిన కడియం శ్రీహరి మళ్ళీ ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తారా…? లేకుంటే మాట ప్రకారం పోటీ నుంచి తప్పుకుంటారా… ? అనే చర్చ సాగుతుంది. చూడాలి శ్రీహరి స్పీకర్ నోటీసులపై ఎలా స్పందిస్తారూ.. ఆయన సంజాయిసిపై స్పీకర్ ఎలా ప్రతి స్పందన ఎలా ఉండబోతుంది అనే చర్చ సాగుతుంది.
Also Read: Traveller: 197 దేశాలను చుట్టొచ్చాడు.. వరస్ట్ నగరం ఎప్పటికీ అదేనట.. ఎందుకో తెలిస్తే షాకే!
