Etela Rajender: ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం.. ఎంపీ ఈటల ఆగ్రహ
Etela Rajender ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Etela Rajender: ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం.. ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల ఆగ్రహం!

Etela Rajender: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన, పంట చేతికొచ్చినా కాంటాలు ఏర్పాటు చేయడంలో జాప్యం జరగడం, మిల్లుల్లో రోజుల తరబడి అన్నదాతలను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్‌కు 8 కేజీల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకోవడం దుర్మార్గం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సన్న వడ్లకు ప్రకటించిన రూ.500 బోనస్‌, రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే ప్రతి రైతుకూ చెల్లించాలని ఈటల డిమాండ్‌ చేశారు.

Also Read:Etela Rajender: గురుకులాల్లో ఆత్మహత్యలు.. సౌకర్యాల కొరత, పర్యవేక్షణ లోపంపై.. ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన

10 వేల పరిహారాన్ని వెంటనే అందించాలి

వర్షాలు, తుఫానుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారాన్ని వెంటనే అందించాలని కోరారు. అలాగే, పత్తి సేకరణను ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టాలని, సీసీఐ సంస్థ 7 క్వింటాల్ నిబంధనను సడలించి కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలంగా నిలబడుతుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెలిచే సత్తా తమకే ఉందన్నారు. ‘మా అభ్యర్థులను గెలిపిస్తే, పనులు చేయించే బాధ్యత నాది’ అని హుజూరాబాద్ ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.

Also ReadEtela Rajender: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ ఈటల రాజేందర్

Just In

01

Job Scam: విదేశీ ఉద్యోగం అని గంతేస్తున్నారా? నకిలీ జాబ్ మోసాలు వెలుగులోకి!

Apple Phones: ఐఫోన్ యూజర్స్‌కి గుడ్‌న్యూస్.. చాట్‌జీపీటీని ఒక్క టచ్‌తో స్టార్ట్ చేయండి!

Lady Boss Bad Touch: లేడీ బాస్ వేధిస్తోంది.. అసభ్యంగా తాకుతోంది.. యువ ఉద్యోగి ఆవేదన

Samantha Wedding: దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు!.. ఎక్కడంటే?

Local Body Elections: నగదు లేకుంటే బరిలోకి రాకండి.. ఆశావహులకు ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల ఆదేశాలు!