Etela Rajender (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Etela Rajender: గురుకులాల్లో ఆత్మహత్యలు.. సౌకర్యాల కొరత, పర్యవేక్షణ లోపంపై.. ఈటల రాజేందర్ తీవ్ర ఆందోళన

Etela Rajender: ప్రభుత్వ గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలల్లో కనీస సౌకర్యాల లేమి, సరైన పర్యవేక్షణ కొరవడటం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ కారణాల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ సౌకర్యాలు అరకొరగా ఉన్నాయని, విద్యార్థుల డైట్ చార్జీలు సైతం సక్రమంగా, సమయానికి రావడం లేదని ఆయన విమర్శించారు. పాఠశాలల్లో సరైన సిబ్బంది, ముఖ్యంగా వార్డెన్ల వ్యవస్థ పూర్తిగా కొరవడటంతో, ఉపాధ్యాయులే వంతులవారీగా విద్యార్థులను చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 600 నుండి 700 మంది విద్యార్థులు ఉన్నచోట వారికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సైకియాట్రిస్ట్‌ల ఇంటరాక్షన్ అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Also Read: Etela Rajender: ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది : ఎంపీ ఈటల రాజేందర్

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

రాంపూర్‌కు చెందిన విద్యార్థిని శ్రీ వర్షిత ఆత్మహత్య ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఈటల, ఇలాంటి టాపర్ ఆత్మహత్యకు బలమైన కారణాలు ఉండి ఉంటాయని, వాటిని లోతుగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల కోట్లతో భవనాలు కట్టడం కాదు, హాస్టల్‌లలోని పిల్లలకు భద్రత, భరోసా, ఆత్మవిశ్వాసం పెంచే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆత్మహత్యలకు దారితీసే భయానక వాతావరణం ఉండకుండా చూడాలని ఆయన కోరారు. తుఫాను విధ్వంసం అప్రమత్తత కొరవడిన యంత్రాంగం రైతులకు తక్షణ పరిహారం ఇవ్వాలి. ఈటల డిమాండ్‌తుఫాను హెచ్చరికలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తత పాటించకపోవడం వల్ల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం, విషాదం చోటుచేసుకున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. తుఫాను ప్రభావంతో సైదాపూర్, భీమదర్లలో ఏకంగా 41 సెం.మీ. వర్షపాతం నమోదై, హుజరాబాద్ నియోజకవర్గంలో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12 మంది మరణించగా, పక్క రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, ఇక్కడ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని అన్నారు.

ఎకరానికి రూ. 40,000 ఇవ్వాలి

చిలకవాగు ఉధృతికి ఇరువైపులా వందల, వేల ఎకరాల్లోని పంట మొత్తం కొట్టుకుపోయి, పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోగా, కొన్నిచోట్ల లోతైన గోతులు ఏర్పడ్డాయి. కౌలు రైతులు లక్షల ఖర్చుతో కోతకు సిద్ధంగా ఉన్న వడ్లను కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. ఇంత నష్టం జరిగినా, ఇప్పటివరకు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు గానీ, నష్టం అంచనా వేసే సర్వే చేస్తున్న దిక్కు లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
​ముఖ్యమంత్రి వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సహాయక చర్యలు చేపట్టాలని, కోతకు గురైన పొలాల మరమ్మతుకు సహకరించాలని డిమాండ్ చేశారు. తక్షణ పరిహారంగా, వరి, మక్క పంటలకు ఎకరానికి కనీసం రూ. 25,000, పత్తి పంటకు ఎకరానికి రూ. 40,000 ఇవ్వాలని ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిహారం అందిస్తేనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా మళ్లీ వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Also ReadMP Etela Rajender: ఆత్మగౌరవం కోల్పోయాక పదవి గడ్డిపోచతో సమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు

Just In

01

Income Tax: ఆదాయపు పన్ను నోటీసులకు దూరంగా ఉండాలంటే వీటిని తప్పక పాటించండి!

Errabelli Dayakar Rao: రాష్ట్రంలో రైతుల బాధలు ముఖ్యమంత్రికి పట్టవా?: ఎర్రవెల్లి దయాకర్ రావు

Hyderabad Metro: హైదరాబాదీలకు మెట్రో రైల్ బ్యాడ్‌న్యూస్.. సోమవారం నుంచే అమలు

Kalvakuntla Kavitha: నేను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని.. కవిత సంచలన కామెంట్స్

Nagarkurnool District: మొంథా తుపాను ఎఫెక్ట్.. శాఖల వారీగా పంట నష్టాలను సేకరించండి