Telangana Secretariat: హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న గ్రిల్ లో ప్రమాదవశాత్తు ఓ మహిళా ఉద్యోగిని కాలు ఇరుక్కుపోయింది. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్ లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. కాలు బయటకు రాక ఆమె ఎంతో వేదన అనుభవించింది. ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాలు బయటక రాక ఇబ్బందులు ఎదుర్కొంది.
Also Read: Kalvakuntla Kavitha: సింగరేణి ముట్టడి ఉద్రిక్తం.. రోడ్డుపై బైఠాయించిన కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు
అటుగా వెళ్తున్న తోటి ఉద్యోగులు మహిళ కాలును బయటకు తీసేందుకు యత్నించినప్పటికీ అది ఫలించలేదు. దీంతో అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. స్కానర్ గ్రిల్ ను కట్ చేశారు. అనంతరం ఉద్యోగిని కాలును జాగ్రత్తగా బయటకు తీశారు. మహిళ కాలుకు పెద్ద గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే స్కానర్ గ్రిల్ ను కట్ చేస్తున్నంత సేపు.. బాధితురాలు అక్కడే కూర్చుండిపోవడం గమనార్హం.
