Nashik Bus Station: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ బస్‌స్టాండ్‌లో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి ఫ్లాట్ ఫామ్ పై నిల్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.
కంట్రోల్ తప్పిన బస్సు
అయితే బస్సు.. సిన్నార్ బస్ స్టాండ్ లోకి ప్రవేశించగానే కంట్రోల్ తప్పినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పూర్తిగా బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్లాట్ ఫామ్ వద్దకు రాగానే బస్సును డ్రైవర్ ఆపలేకపోయాడు. దీంతో అది ముందుకు వచ్చి.. ఫ్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులను బలంగా ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన దుకాణాదారులు, తోటి ప్రయాణికులు హుటాహుటీనా పరిగెత్తుకు వచ్చి.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
బాలుడు ఎవరంటే?
బస్సు ప్రమాదంలో మృతి చెందిన బాలుడ్ని 9 ఏళ్ల ఆదర్శ్ బొరాడేగా అధికారులు గుర్తించారు. బాలుడి కుటుంబం పండరిపురం (Pandharpur) యాత్రను ముగించుకొని స్వగ్రామమైన దాపూర్ కు వెళ్లేందుకు సిన్నార్ బస్టాండ్ లో వేచి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అనుకోకుండా బస్సు దూసుకొచ్చి బాలుడు మరణించినట్లు చెప్పారు. దీంతో చిన్నారి కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. బాలుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
Also Read: iBomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు
డ్రైవర్ నిర్లక్ష్యమా?
ప్రమాద వీడియోను గమనిస్తే.. బస్సు సాధారణ వేగంతోనే బస్టాండ్ లోకి వచ్చింది. ఈ ప్రమాదానికి గల కారణాలను స్థానిక పోలీసులు అన్వేషిస్తున్నారు. బ్రేక్ ఫెయిల్ అయ్యిందా? డ్రైవర్ నిర్లక్ష్యమా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జరిగిన ఘటనతో డ్రైవర్ మానసికంగా కుంగిపోయాడని.. అతడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక విచారిస్తామని పోలీసులు తెలిపారు. గాయపడినవారంతా సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
🚨 Major Accident at Sinnar Bus Stop, Nashik
A tragic incident occurred at the Sinnar bus stop in Nashik when a bus’s brakes failed, running over 5 people.
One child lost their life, while 4 others were injured.
The entire accident was captured on CCTV footage.#Nashik #Sinnar… pic.twitter.com/TdLUKUU2bR— Indian Observer (@ag_Journalist) November 19, 2025
