iBomma Ravi (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్, లేటెస్ట్ న్యూస్

iBomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు

iBomma Ravi: ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని 5రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ బుధవారం నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సైబర్ క్రైం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొనున్నారు. కొత్త సినిమా రిలీజ్ కాగానే పైరసీ చేసి వాటిని ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్లలోకి అప్ లోడ్ చేస్తూ రవి టాలీవుడ్ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిన విషయం తెలిసిందే. పైగా నన్ను పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ కూడా విసిరాడు.

రవి వెనుక ఎవరున్నారు?

ఐబొమ్మ రవి సవాలును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాగా రవి నడిపిన పైరసీ రాకెట్ లో మరికొందరు కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చెయ్యటం ద్వారా కొట్లాది రూపాయలు వెనకేసుకున్నట్టు ఇప్పటికే గుర్తించారు. పైరసీలో రవికి సహకరించింది ఎవరూ? నగదు లావాదేవీలు ఎలా నడిపాడు? అతనికి దేశ విదేశాల్లో ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? అన్న వివరాలు తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంటూ వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు 5రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐబొమ్మ రవిపై బయోపిక్..

ఐబొమ్మ ద్వారా సినిమాలను పైరసీ చేసిన ఇమంది రవిపై సినిమా తీయబోతున్నట్లు తేజ్ క్రియేటివ్ వర్క్స్ అనే నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఐబొమ్మ రవి జీవితంలోని వాస్తవాలు (Facts), తన పైరసీ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన చేసిన పోరాటం, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న వెన్నుపోట్లు, అతని టీమ్‌కు సంబంధించి ప్రపంచానికి తెలియని చీకటి కోణాలను వెండితెరపై చూపించబోతున్నట్లుగా స్పష్టం చేసింది. వెబ్‌డిజైన్‌లో పట్టు ఉన్న సాధారణ వ్యక్తిగా మొదలై, అక్రమ సంపాదనకు దారితీసిన అతని మానసిక వేదన, అవమానాలు (ముఖ్యంగా భార్య, అత్తామామల నుండి) వంటి వ్యక్తిగత అంశాలు కూడా ఈ కథలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు, లక్షలాది మంది సినీ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన పైరసీ కింగ్‌పై సినిమా తీయడం ద్వారా, అతడిని ఒక హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

Also Read: Telangana Weather: చలితో అల్లాడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్.. వాతావరణ శాఖ తీపి కబురు!

ఎవరీ ఐబొమ్మ రవి?

ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి స్వస్థలం విశాఖ. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు తీసుకున్నాడు. హ్యాకింగ్ వైపు దృష్టి పెట్టిన రవి.. మొదటి నుంచి నేర ప్రవృత్తితోనే ఉన్నాడు. ఒకానొక టైమ్‌లో సినీ ఇండస్ట్రీ అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు.. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. ఆ వెంటనే ఆయన భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్‌ దీవుల్లో ఉన్న సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరుగుతూ ఉండేవారు. 2022 నుంచి కరేబియన్ దీవుల్లో ఉంటున్న ఐబొమ్మ రవి.. హైదరాబాద్, వైజాగ్ లోని తన ఆస్తులను అమ్ముకోవాలని భావించాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ కు వచ్చి పోలీసులకు దొరికిపోయినట్లు నగర సీపీ సజ్జనార్ వెల్లడించారు.

Also Read: Bandi Sanjay: హిందుత్వమే నా శ్వాస.. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాం.. బండి సంజయ్

Just In

01

Kalvakuntla Kavitha: సింగరేణి ముట్టడి ఉద్రిక్తం.. రోడ్డుపై బైఠాయించిన కవిత.. అరెస్ట్ చేసిన పోలీసులు

Nayanthara: అవకాశాలతోనే అందరికీ సమాధానమిస్తోన్న లేడీ సూపర్ స్టార్..

Nashik Bus Station: బస్టాండ్‌లో ఘోరం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్

iBomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు

Bandi Sanjay: హిందుత్వమే నా శ్వాస.. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాం.. బండి సంజయ్