Tamil Nadu Crime: తమిళనాడులో ఘోర విషాదం..
Crime ( Image Source: Twitter)
క్రైమ్

Tamil Nadu Crime: తమిళనాడులో ఘోర విషాదం.. లవ్ ప్రపోజల్‌ రిజెక్ట్ చేయడంతో అమ్మాయిపై కత్తితో దాడి

Tamil Nadu Crime: తమిళనాడులోని రామేశ్వరంలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శాలినిని, ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్న 21 ఏళ్ల యువకుడు మునియరాజ్ కత్తితో పొడిచి హతమార్చాడు. ఆమె అతని ప్రేమను కొన్ని సార్లు కాదనడంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మునియరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

శాలిని రామేశ్వరం గవర్నమెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుతోంది. ఆమె కుటుంబం రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం సమీపంలోని గ్రామంలో నివసిస్తోంది. శాలిని తండ్రి మరియప్పన్ వృత్తి రీత్యా మత్స్యకారుడు. ఇద్దరు కుమార్తెలలో శాలినే పెద్దది. పక్కింట్లోనే నివసించే మునియరాజ్ కొంతకాలంగా శాలినిని వేధిస్తూ వచ్చినట్టు విచారణలో బయటపడింది. ప్రేమ పేరుతో కొన్ని సార్లు ఆమె దగ్గరకి వచ్చి ఇబ్బంది పెడుతుండటంతో ఆమె అతనిని నిరాకరించింది. అతని ఈ నిరంతర వేధింపులు చివరకు విషాదానికి దారితీశాయి.

Also Read: Parineeti Chopra: తన కుమారుడికి ఎవరూ ఊహించని పేరు పెట్టిన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా.. అర్థం ఏంటంటే?

యువకుడి వేధింపులు తాళలేక శాలిని ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దీంతో, కంగారుపడ్డ మరియప్పన్, మునియరాజ్ ఇంటికి వెళ్లి అతనిని హెచ్చరించాడు. ఇక మీదట తన కూతురిని వేధిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించినట్టు సమాచారం. ఈ హెచ్చరికే మునియరాజ్‌ను మరింత కోపంతో ఉలిక్కిపడేలా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Malaysia Glowing Roads: స్ట్రీట్‌లైట్ రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన గ్లోయింగ్ రోడ్ల ప్రయోగం మలేషియాలో ఎందుకు ఫెయిలైంది?

తమిళనాడులో దారుణ హత్య? 

ఘటనా రోజున శాలిని పాఠశాలకు వెళ్లే దారిలో ఉన్నప్పుడు, కోపంతో ఉన్న మునియరాజ్ ఆమెను అడ్డగించి కత్తితో వరుసగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శాలిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ సంఘటన ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు ఘటన అనంతరం పారిపోయినప్పటికీ, ప్రత్యేక బృందంతో మునియరాజ్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడిని విచారణకు తరలించారు.

Also Read: Tirumala News: తిరుమల భక్తులు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయాలు..!

ఈ హత్య అక్కడున్న ప్రాంత ప్రజల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితుడు చట్టం ప్రకారం అత్యంత కఠినమైన శిక్షను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దారుణం బాలికల భద్రతపై మరలా ఆందోళనను రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..