Parineeti Chopra: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు రాఘవ్ చద్దా దంపతులకు కుమారుడు పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఎందో మంది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, తమ ముద్దుల కుమారుడి పేరును అధికారికంగా ప్రకటించారు ఈ జంట. అక్టోబర్ 19న జన్మించిన తమ బాబుకు ‘నీర్’ (Neer) అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రకటనతో పాటు, బాబు మొదటి గ్లిమ్స్‌ను కూడా ప్రేక్షకులతో పంచుకోవడంతో అభిమానులు, సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తల్లిదండ్రులుగా మారిన తర్వాత దాదాపు ఒక నెల వరకు తమ బిడ్డ వివరాలను గోప్యంగా ఉంచిన ఈ జంట, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో తమ కుమారుడి పేరును వెల్లడించారు. ఈ పోస్ట్‌లో వారు తమ కుమారుడి ముఖం పూర్తిగా కనిపించకుండా ఒక మృదువైన ఫోటోను షేర్ చేస్తూ, ఆ పేరుకు సంబంధించిన లోతైన, కవితాత్మకమైన అర్థాన్ని వివరించారు.
Read also-Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..
‘నీర్’ అంటే..
రాఘవ్, పరిణీతి కలిసి పంచుకున్న సందేశం ఈ విధంగా ఉంది.. “𝙅𝙖𝙡𝙖𝙨𝙮𝙖 𝙧ū𝙥𝙖𝙢, 𝙥𝙧𝙚𝙢𝙖𝙨𝙮𝙖 𝙨𝙫𝙖𝙧ū𝙥𝙖𝙢 — 𝙩𝙖𝙩𝙧𝙖 𝙚𝙫𝙖 𝙉𝙚𝙚𝙧. మా హృదయాలు శాశ్వతమైన జీవన బిందువులో శాంతిని పొందాయి. మేము అతనికి నీర్ అని పేరు పెట్టాము. స్వచ్ఛమైన, దైవికమైన, అపరిమితమైన .” సంస్కృత మూలాలను కలిగి ఉన్న ఈ ‘నీర్’ అనే పేరు, కేవలం ‘నీరు’ అనే అర్థాన్ని మాత్రమే కాకుండా, ‘స్వచ్ఛత’, ‘దైవత్వం’, ‘అపరిమితమైన ప్రేమ’ వంటి విస్తృతమైన భావాలను ప్రతిబింబిస్తుంది. తమ జీవితంలోకి అడుగుపెట్టిన ఆనందాన్ని, ప్రశాంతతను వ్యక్తం చేస్తూ వారు ఈ పేరును ఎంచుకోవడం, వారి అనుబంధంలోని లోతును తెలియజేస్తోంది.
Read also-Tulasi retirement: సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలికిన సీనియర్ నటి తులసి.. ఇక నుంచి సాయిబాబా సేవలో..
కుమారుడు జన్మించిన వెంటనే, ఈ జంట తమ ఆనందాన్ని పంచుకుంటూ, “అతను చివరకు వచ్చేశాడు! మా బాబు. అతనికి ముందు జీవితం ఎలా ఉండేదో మాకు అస్సలు గుర్తులేదు,” అంటూ ఒక ఉద్వేగభరితమైన నోట్‌ను పోస్ట్ చేశారు. అప్పటి నుండి, అభిమానులు బాబు పేరు, మరిన్ని వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఈ తాజా పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీ ప్రముఖులు గౌహర్ ఖాన్, భారతీ సింగ్ వంటి వారితో పాటు వేలాది మంది అభిమానులు తమ ప్రేమను, శుభాకాంక్షలను తెలియజేస్తూ వ్యాఖ్యానించారు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా గురించి చెప్పాలంటే, వారు 2023 మేలో న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. అదే సంవత్సరం చివర్లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ది లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు, వారి జీవితంలోకి ‘నీర్’ రాకతో ఈ దంపతుల ఆనందం పరిపూర్ణమైంది. ఆది చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
