iBOMMA: మూవీ పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసు వివరాలను సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ” సినీ ఇండస్ట్రీకి పైరసీ వల్ల ఎవరూ పూడ్చలేని నష్టం జరిగిందని అన్నారు. మనకి తెలియని కొత్త నెట్ వర్క్ లు వాడి సినిమా ఫస్ట్ ప్రింట్ ను కాపీ చేసి అప్లోడ్ చేసేవాడు. ఇలా ఇమ్మడి రవి మొత్తం కోటాను కోట్లు సంపాదించాడు. అంతే కాకుండా అతను చేసిన యాప్స్ ప్రమోషన్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. రవి సొంతూరు వైజాగ్. 1970 నుంచి ఇప్పటి వరకు ఉన్న సినిమాలన్ని రవి దగ్గర ఉన్నాయని చెప్పారు. అతని నెట్ వర్క్ చాలా పెద్దది. 21 వేల హార్డ్ డిస్క్ లు ఉన్నాయి. రవి పైన మొత్తం 5 కేసులు పెట్టాము. ఇప్పటి వరకు రూ. 20 కోట్లు సంపాదించాడు. వాటిలో రూ. 3 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ” ఎవరూ కూడా ఇలాంటి వెబ్ సైట్లలో సినిమాలు చూడకండి. మీకే నష్టం జరుగుతుందని అన్నారు. హైద్రాబాద్ పోలీసులు, తెలుగు నటులు కూడా చాలా సహకరించారు. పైరసీ పైన మన ఉగ్ర పోరాటం చేస్తున్నాం. ఎవరూ ఇలాంటివి చేసినా మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఇలాంటి వెబ్ సైట్ పైన ఎలాంటి కొంచం ఇన్ఫోర్మేషన్ తెలిసినా 1903 కి కాల్ చేసి చెప్పండి. నేను ఈ సందర్భంగా పబ్లిక్ ను కోరుతున్నాను. సైబర్ క్రైమ్స్ కానీ, ఇలాంటి వెబ్ సైట్స్ కానీ ఎలాంటి సమాచారం తెలిసిన 1903 కి ఫోన్ చేయమని మీ అందర్ని కోరుతున్నాను. చాలా మందికి ఇంకా తెలియడం లేదు? మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఒక గోల్డెన్ అవర్ ఉంది. అలాగే, ఈ సైబర్ క్రైమ్ కి కూడా గోల్డెన్ అవర్ నెంబర్ ఉంది అదే 1903. దీని గురించి ఇంకా పబ్లిక్ లో వెళ్లాల్సిన అవసరం ఉందని ” అన్నారు.
హైద్రాబాద్ పోలీస్ గడప గడపకి ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది. గత నెల డీజీపీ కూడా దీని గురించి చెప్పారు. మన పోలీసులు కూడా ఇంటి ఇంటికి వెళ్లి చెప్పారు. మనము కూడా దీని గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. 1903 లేదా cybercrime.gov.in లో కూడా మీరు కంప్లెయింట్ కూడా చేయాలని కోరుతున్నాను. అదే విధంగా దీనికి సహకరించిన దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, రాజమౌళి కి థాంక్స్ చెప్పారు.
