Illegal Constructions: ఫామ్ ల్యాండ్స్ పై నియంత్రణ ఏదీ…?
-ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
-నిబంధనలకు విరుద్ధంగా అధికారుల వ్యవహారం
-సాగు భూమిలో రోడ్లు, డ్రైనేజిలు నిర్మాణం
-అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టని పంచాయతీ అధికారులు
-రెవెన్యూ, పంచాయతీ అధికారుల మధ్య కొరవడిన సమన్వయం
-విచ్చలవిడిగా ఉమ్మడి రంగారెడ్డిలో ఫామ్ ల్యాండ్ వ్యాపారం
రంగారెడ్డి బ్యూరో స్వేచ్ఛ: ప్రభుత్వ నిబంధనలతో పనిలేదు… అధికారుల మద్దతు ఉంటే చాలు అంటున్నా వ్యాపారులు. నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే మాకు గిట్టుబాటు కాదని రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారులు ఫామ్ ల్యాండ్లు చేస్తున్నారు. సాగుకు యెగ్యమైన భూముల్లో నిర్మాణాలు చేస్తూ లాభాలు గటిస్తున్నారు. అదే భూమిని నమ్ముకున్న రైతుకు గిట్టుబాటు ధర లేక.. పెట్టిన పెట్టుబడి రాక నానాఅవస్థలు పడుతున్నారు. ఈ రైతులకు వచ్చే భూసమస్యలు భూ భారతిలో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. అదే రియల్ వ్యాపారికి క్షణాల్లో భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సాగు భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. సాగు భూమిని నివాసయోగ్యానికి అనుకూలంగా భూ మార్పిడి జరగాలి. భూ మార్పిడి చేయాలంటే నాలా గా మార్చుకునేందుకు నిబంధనలు ప్రకారం ప్రభుత్వానికి నగదు చెల్లించాలి. దాంతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ విలువ పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. ఈ ఆదాయానికి గండి కొడుతున్న వారిలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు అని చెప్పక తప్పదు.
సాగు భూములకే కదా పట్టాలు..
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) సాగు భూములతో వ్యాపారం చేసే వాళ్లకు రైతు భరోసా ఇవ్వమనే ప్రచారం సాగింది. జిల్లాలోని రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యమైన భూములు ఎన్ని, కొండలు, గుట్టలు ఎన్ని ఎకరాలు ఉన్నాయనే వివరాలు సేకరించారు. దాంతో పాటుగా ఫామ్ ల్యాండ్స్ పేరుతో రియల్ వ్యాపారం ఎన్ని ఎకరాల్లో ఉందో కూడా లెక్కలు తీసినట్లు సమాచారం. కానీ ఈ వివరాలను బహిర్గతం చేయకుండా గొప్యంగా ఉంచారు. అంతేకాకుండా ఫామ్ ల్యాండ్లకు రైతు భరోసా కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వ్యాపారులు సాగుభూములను గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తూ గజల్లో ధరలు నిర్ణయించడం అలవాటుగా మారిపోయింది. అవసరాల కోసం రైతులు అతి తక్కువకు వ్యాపారుల వద్ద ఎకరాల్లో, గుంటల్లో ధరను నిర్ణయించుకొని కొనుగోలు చేస్తారు. ఇదే భూమిని గజల్లో ధరను నిర్ణయించి మార్కెట్లో విక్రయలు చేస్తున్నారు. ఇక్కడ తేడా ఏంటి అంటే ఎకరం ధర రూ.5లక్షలు అనుకుంటే అదే ఎకరం గజల్లో కి మారితే 4వేల గజాలు అవుతుంది. అందులో 3వేల గజలకు లెక్కగడితే గజానికి తక్కువలో తక్కువగా ఆ ఏరియాను బట్టి రూ.1500లు పెట్టిన రూ.45లక్షలు వస్తాయి. రైతు ఎంత నష్టపోతున్నాడు అనేందుకు ఇదీ ఒక ఉదారహణ. ఇలాంటి అక్రమ సంపాదనకు పాల్పడుతున్న రియల్ వ్యాపారులకు చట్టాలు ఉండవు. ఇలాంటి వాళ్లకు చట్టాలు చుట్టాలుగా మరే పరిస్థితి ఉంది. ఈ అక్రమాల పై ప్రభుత్వం ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: AV Ranganath: అక్రమ మార్కింగ్‌లపై చర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు
శాఖల్లో సమన్వయ లోపం..
క్షేత్రస్థాయిలో జరిగే అక్రమాల పై ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ అధికారులు తప్పించుకుంటారు. సాగు భూమిలో నిర్మాణం చేస్తే పంచాయతీ అధికారులు(Panchayat officials) పట్టించుకోరు.. అదే భూమిలో రోడ్లు వేస్తే రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇష్టానుసారంగా రెవెన్యూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఉంటే పట్టించుకోరు. పిర్యాదులు వస్తే సదరు రియల్ వ్యాపారితో ఒప్పందం కుదర్చుకొని మౌనంగా ఉంటారు. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని తప్పించుకుంటారు. ఇప్పటికే జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం జోరుగా నడుస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫోర్త్ సిటీలో ఇదే దుస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఫామ్ ల్యాండ్స్ చేసిన సాగు భూములను నాలాగా మార్పు చేస్తే ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకురే అవకాశం ఉంది. అధికారులు కూడా గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ సర్వే నెంబర్లో పూర్తిగా విక్రయం చేస్తే చేయాలి. కానీ ఆ సర్వే నెంబర్లో ఒకేసారి గుంటలు గుంటలుగా చేసేటప్పుడు అధికారులు ఆలోచన చేయాలి. ఆ సర్వే భూమి పై కన్ను వేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా అధికారులు బాధ్యతగా చేస్తే ఆ ఫలితాలు పేదలకు అందుతాయని నమ్మకం ఉంటుంది.
–చేవెళ్ల మండలంలోని ఆలూర్, కిష్టాపూర్ రెవిన్యూ పరిధిలో ఎన్ఆర్ఐ పేరుతో ఫాంల్యాండ్ చేశారు.
–చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ఏడు ఎకరాల్లో లోటస్ పేరుతో ఫాం ల్యాండ్
–చేవెళ్ల మండలం ఆలూర్ రెవెన్యూ పరిధిలో విచ్చలవిడీగా ఫాం ల్యాండ్స్ చేశారు. ఇందులో ఎస్ఎన్, ఏఎంహెచ్, లక్కి, ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1,2,3లల్లో బోర్డులు లేకుండా ఫామ్ ల్యాండ్
–మెయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామం సర్వే నెంబర్ 267లో 21 ఎకరాల్లో ఎన్ఆర్ఐ పేరుతో ఫామ్ ల్యాండ్ ఏర్పాటు చేశారు. గజాల్లో నగదు తీసుకోని గుంటల్లో భూమిని రిజిస్ట్రేషన్లు చేశారు.
–కందుకూరు మండలం నేదునూరు, బాచుపల్లి, పెరుగూడ గ్రామాల రెవిన్యూ పరిధిలో తులిప్ ఫాం పేరుతో ఏర్పాటు చేశారు.
–కందుకూర్ మండలం ధన్నారం గ్రామంలో పోలం పేరుతో ఫాం ల్యాండ్ నిర్వహించారు.
Also Read: BRS: బీఆర్ఎస్ కష్టపడినా రాని ఫలితం.. కలిసి రాని ప్రభుత్వ వ్యతిరేకత!
