Medchal Municipality: మేడ్చల్ జిల్లా లోని అది మేజర్ మున్సిపాలిటీ. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మున్సిపాలిటీలో అలజడి ప్రారంభమైంది. ఉదయం నిద్ర లేవగానే కనిపి పత్రికల్లో ప్రధాన శీర్షికలో ఆ మున్సిపల లో జరుగుతున్న అవినీతే దర్శనమిస్తుంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న మున్సిపల్ కార్యాలయం ఇప్పుడు అవినీతి ఆరోపణలతో పత్రికలో ప్రధాన శీర్షికలలో నిలుస్తుంది. అసలు ఆ మున్సిపల్ కార్యాలయంలో ఏం జరుగుతుంది. ఎందుకు ఆ మున్సిపల్ కార్యాలయం పై ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆయన చెప్పిందే వేదం
సదరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి హవా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన ఏం చెప్తే అదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మున్సిపల్ లో కమిషనర్ ఉన్న లేనట్లే అనే విమర్శలు ఉన్నాయి. దీంతో సదరు అధికారి పెట్టరేగిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ మున్సిపల్ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల కోసం ఈ అధికారిని కలిస్తే చాలు అన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల సదరు అధికారిపై పై అధికారులకు ఫిర్యాదులు సైతం అందాయి అని తెలుస్తుంది.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ సాధించిన చారిత్రక విజయం.. కార్యకర్తలు నేతలు సంబురాలు
తోటి ఉద్యోగులపై పెత్తనం
తోటి ఉద్యోగులపై సైతం ఈ అధికారి పెత్తనం ఎక్కువైందని తెలుస్తోంది. గతంలో అంటి ముట్టనట్టుగా వివరించిన సదరు అధికారి ఇటీవల తోటి ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తూ భయందోలనలకు గురి చేస్తున్నాడు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో స్వేచ్ఛగా మా పనులు మేం చేసుకునే వారి మని, ఇప్పుడు సదరు అధికారి ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఆందోళనలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు ఉద్యోగులు వాపోయారు. మమ్మల్ని పూర్తిగా డమ్మీ చేశారని పేర్కొన్నారు.
