Rahul Gandhi: సీఎం రేవంత్ అండ్ టీమ్ కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంప్లిమెంట్ ఇచ్చారు.“వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్. గో హెడ్”అంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాహుల్ కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ ని సీఎం రేవంత్ రెడ్ది, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య టీమ్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను సీఎం .. రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. అనంతరం ఎన్నికల పరిస్థితులు, విజయం పై సీఎం రాహుల్ కు వివరించారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీ ఎక్కడ?.. బీహార్ ఫలితాలపై ఇంకా స్పందించని వైనం
కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలి
భవిష్యత్ లోనూ ఇదే జోష్ తో ముందుకు సాగాలని రాహుల్ సూచించినట్లు తెలిసింది. అనంతరం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కూడా ఈ టీమ్ ప్రత్యేకంగా కలిసింది. తెలంగాణ కాంగ్రెస్ వేవ్ కంటిన్యూ అవుతుందని, లీడర్లు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, పదేళ్ల పాటు ప్రభుత్వం ఉండాల్సిందేనని ఖర్గే ఆదేశించిననట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి లు ఉన్నారు.
Also Read: Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పదునైన విమర్శలు
