Kavitha ( image credit: swetcha reporter)
Politics

Kavitha: కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి.. కేటీఆర్ హరీష్ రావు‌ల అరాచకాలు.. కవిత తీవ్ర విమర్శలు

Kavitha: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి,బీ ఆర్ ఎస్ నేతలు, కేటీఆర్, (KTR)  హరీష్ రావు (Harish Rao) లు పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం మానేసి ఆస్తులు పెంచుకోవడంపై దృష్టి పెట్టారని జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో స్వంత అన్నా బావలపై విమర్శలు చేశారు. జాగృతి జనం బాటలో బాగంగా 2 వ రోజు మెదక్ నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలో నీ వినాయక ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.కే సీ ఆర్ కళ్లకు గంతలు కట్టి బీ ఆర్ ఎస్ పార్టీ నీ అదో గతి పాలు చేశారని విమర్శించారు.

Also ReadMLC Kavitha: హైర్ బస్సు డ్రైవింగ్ ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాలి:ఎమ్మెల్సీ కవిత

ఈ అరాచకాలు కేసీఆర్ కు తెలిసి ఉంటే ఏట్టి పరిస్తితిలో అంగీకరించే వారు కారని విమర్శించారు. జూబ్లీహిల్స్ పలితం చూశాక బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించడం లేదని గ్రహించాలని అన్నారు.హరీష్ రావు పార్టీలో ఉండి పార్టీని మోసం చేస్తున్నారని కవిత ఆరోపించారు. కేటిఆర్ సోషల్ మీడియా ను వదిలి జనం బాట పట్టాలని కవిత సూచించారు. హరీష్ అన్న పార్టీలో ఉండి పార్టీని మోసం చేయడం మానుకోవాలన్నారు. కృష్ణార్జునులు అనుకునేవాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చర్చుకుంటున్నారని కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకత ఉన్నా ప్రతిపక్ష పార్టీ పాత్ర సరిగా లేకనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అన్నారు.

బీఆర్ఎస్ నేతల భూములు కారణగానే.. రింగ్ రోడ్డు వంకర తిరిగింది

బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు,గంగుల కమలాకర్,మరో నేత కు నర్సాపూర్ నియోజకవర్గం,రెడ్డి పల్లి గ్రామ శివారులో భూములు ఉన్నాయని అన్నారు.హరీష్ రావు కు 400 ఎకరాలు ఉందని,గంగుల కమలాకర్ కు 15 ఎకరాల భూమి ఉందని,మరో నేత నవీన్ రావు కు 20 ఎకరాలు ఉందని ఆ భూముల గుండా రోడ్ పోకుండా అలైన్ మెంట్ మార్చి 50 వంకలు తిరిగిందని,59 మంది రైతుల భూములు 56 ఎకరాలు పోతుందని రైతులు స్వయంగా చెబుతున్నారని కవిత ఆరోపించారు.

 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగలేదు 

భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ నియోజక వర్గంలో గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగలేదని ఆరోపించారు. అప్పటి ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి 2009 లో కే సీ ఆర్ టికెట్ ఇవ్వకుంటే కేసీఆర్ ను తిట్టి పోసిందని విమర్శించారు. హరీష్ రావు ప్రోద్బలంతో మళ్ళీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే గా గెలిచి పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదని కవిత విమర్శించారు. ఈ సమావేశంలో జాగృతి నాయకులు మారయ్య,చంద్రశేఖర్,రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Kavitha: జాగృతితో పెట్టుకున్నోళ్లు.. ఎవరూ బాగుపడలేదు.. కవిత సంచలన కామెంట్స్!

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!