MLC Kavitha: తెలంగాణ ఆర్టీసీ(RTC)లో చిన్న చిన్న కారణాలతో తొలగించిన కండక్టర్లు(Conductors), డ్రైవర్లు(Drivers) సహా ఇతర కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్(Hyderabada)లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆమె ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో భేటీ అయి, ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
గతంలోనే 491 మంది..
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాల వల్ల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు సుమారు 1,300 మందిని సంస్థ డిస్మిస్ చేసిందని, వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. గతంలోనే 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఉత్తర్వులు ఇచ్చినా, వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచన సంస్థలో లేదని ఎండీని కలిసిన తర్వాత తెలిసిందని ఆమె అన్నారు. ఆర్టీసీ(RTC)లో తీసుకుంటున్న హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులపై ఆర్టీసీకి నియంత్రణ ఉండటం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Jubilee Hills Counting: రేపు జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఫలితం ఎప్పటిలోగా వస్తుందంటే?
డ్రైవర్లే నడిపించేలా చర్యలు
హైర్(Hire), ఎలక్ట్రిక్ బస్సు(electric buses)లను ఆర్టీసీ డ్రైవర్లే నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొందిన వారని, ప్రైవేటు డ్రైవర్లతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అవుతారని ఆమె ప్రశ్నించారు. అలాగే, ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు. అప్పుడే ప్రజలకు భద్రమైన ప్రయాణం, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తాయని కవిత వెల్లడించారు.
Also Read; Kaantha Review: కాంతా మూవీ రివ్యూ.. భయాన్ని జయించి నిజం కోసం నిలిచిన కథ
