Jubilee-Hill-by-poll
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills Counting: రేపు జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఫలితం ఎప్పటిలోగా వస్తుందంటే?

Jubilee Hills Counting: కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు

ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు షురూ
ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్
ఆ తర్వాత షేక్‌పేట డివిజన్ ఓట్ల లెక్కింపు
చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఔట్ల కౌంటింగ్
42 టేబుల్స్.. పది రౌండ్లుగా లెక్కింపు
మధ్యాహ్నాం కల్లా ఫలితం వచ్చే ఛాన్స్!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, రాజకీయ వర్గాలు, ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని గంటల్లోనే మొదలుకానుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలు ఎవర్ని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపుతున్నారన్న విషయం తేలనుంది. అభ్యర్థుల అంచనాలు, రాజకీయ పార్టీల లెక్కలు తేలిపోనున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ (Jubilee Hills Counting) ప్రక్రియ మొదలుకానుంది.

ఇందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఈ నెల 12న జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మొత్తం లక్షా 94 వేల 631 (48.49 శాతం) ఓట్లు పోల్ అవ్వగా, వాటిని లెక్కించేందుకు 42 టేబుల్స్, 10 రౌండ్లుగా లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత సాధారణ ఓట్లను లెక్కించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను బరిలో నిలిచిన 58 మంది అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులతో పాటు నోటాకు వచ్చిన ఓట్లను కూడా ప్రత్యేకంగా లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లుండగా, షేక్‌పేట డివిజన్‌లోని పోలింగ్ స్టేషన్ నెంబర్-1 నుంచి ఓట్ల లెక్కింపును మొదలుపెట్టనున్నట్లు సమాచారం.

Read Also- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

చివరిగా ఎర్రగడ్డ డివిజన్‌కు చెందిన ఓట్లను లెక్కించనున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ స్టేషన్లు 407 ఉండగా, ఫస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్-1 నుంచి ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ 1 నుంచి 42 వరక ఉన్న ఈవీఎంలను తెరిచి, ఆ తర్వాత అవే టేబుల్స్‌పై పోలింగ్ స్టేషన్ నెంబర్ 43 నుంచి పోలింగ్ స్టేషన్ నెంబర్ 85 వరకు, ఇలా రౌండ్ కు 42 పోలింగ్ స్టేషన్లలో పోలైన ఓట్లను లెక్కించి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లతో ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఓట్లను లెక్కించే సమయంలోని చెల్లని ఓట్లను కూడా అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు చూపి పక్కన పెట్టనున్నారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశముందని రాజకీయ నిపుణలు చెబుతుండగా, అసలైన పోటీ అధికార, విపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్యనే ఉండవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు అమలు చేసిన వంద మీటర్ల ఆంక్షను, శుక్రవారం కౌంటింగ్ జరగనున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి సెంటర్ ఆవరణలో కూడా అమల్లో ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల యంత్రాంగం వార్నింగ్ ఇచ్చింది.

Read Also- Emerging New AP: ఏపీకి నూతన శకం!.. పెరుగుతున్న పెట్టుబడులు.. భవిష్యత్‌పై చిగురిస్తున్న ఆశలు!

గెలుపు ఎవరిదైనా మెజార్టీ స్వల్పమే

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు ఏ అభ్యర్థిని వరించినా, అది స్వల్ప మెజార్టీతోనే అన్న అంచనాలున్నాయి. గత 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 19 మంది అభ్యర్థులు, నోటా పోటీలో ఉండగా, మొత్తం 47.58 శాతం ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దిన్ పై 16 వేల 337 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మొత్తం 80 వేల 549 ఓట్లు సాధించగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దిన్ 64 వేల 212 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, 25 వేల 866 ఓట్లతో బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి మూడో స్థానంలో సరి పెట్టుకోవల్సి వచ్చింది. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలో కూడా అధికారులు ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. గతంలో కన్నా స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగి 48.49 శాతంగా (లక్షా 94 వేల 631 ఓట్లు) నమోదయ్యాయి. 2023లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యర్థిపై 16 వేల 337 ఓట్లు సాధించగా, ఇపుడు నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి ఏ అభ్యర్థి గెలిచినా, మెజార్టీ 15 వేల నుంచి 20 వేల మధ్యనే రానున్నట్లు అంచనాలున్నాయి.

Just In

01

POCSO Case: పోక్సో కేసులో దోషికి తగిన శిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్..

Peddi: ‘పెద్ది’ షూటింగ్ వాయిదా.. కారణం ఏంటో తెలుసా?

Gold Chain Theft: 4 తులాల గోల్డ్ చైన్ చోరీ.. 12 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎలాగంటే?

Delhi blast Dubai link: ఢిల్లీ పేలుడు కేసులో మరో షాకింగ్.. దుబాయ్‌లో అనుమానితులు!

Parasakthi Teaser: పెను సైన్యమై కదలిరా.. ‘పరాశక్తి’ టీజర్ ఎలా ఉందంటే?