Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిం చారు. బీఆర్ ఎస్ ను విమర్శించి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టు లపై ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నిం చారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, నక్కలగండి, డిండి ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో ప్రభుత్వం స్పష్టం చేయాలని కవితడిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అవుతు న్నా, నల్గొండ జిల్లాకు కృష్ణా నది నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చాయా? అని ఆమె ఆలోచనాప రులను కోరారు.
Also Read: MLC Kavitha: హరీష్ రావు బినామీ సంస్థ కోసం హాస్పిటల్ అంచనాల పెంపు: ఎమ్మెల్సీ కవిత
ప్రభుత్వం అలసత్వం
కృష్ణా నది నీళ్లు తేవడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే ధర్నా చేస్తా మని హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు వద్ద జరిగిన ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నిం చారు. ‘మంత్రి కోమటిరెడ్డి అన్న నాతో ఏం పంచాయితీ ఉండోరూ పిల్లల్ని ఎందుకు అరెస్ట్ చేయించావు? తెలంగాణ జాగృతితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదు’ అని హెచ్చరించారు. నల్గొండ జిల్లాకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేస్తూ. ఇది ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు, సాయుధ రైతాంగ పోరాట చరిత్ర కలిగిన జిల్లా అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
జాగృతి చరిత్రను కాపాడుకునే ప్రయత్నం
జాగృతి ద్వారా తెలంగాణ చరిత్రను కాపాడుకునే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. అదే చైతన్యం జిల్లాలో ఇప్పటికీ ఉందని, అందుకే తాను జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణలో మళ్లీ విద్యా సంస్థల్లో విద్యార్థి ఎన్నికలు రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాను రాజకీయాలు చేయడానికి రాలేదని స్పష్టం చేస్తూనే, రాజకీయాలు చేసినప్పుడు మీకు గట్టి పోటీదారులను పెడతామని కాంగ్రెస్కు హెచ్చరిక పంపారు. చివరగా, ముఖ్యమంత్రి తో సహా మంత్రులు ముందుగా ప్రజల దగ్గ రకు వెళ్లి వారి దుఃఖాన్ని చూడాలని కవిత సూచించారు.
Also Read: Kavitha: చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సర్కారే కారణం.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్
