Transport Department: వాహానాలకు ఫ్యాన్సీ నెంబర్ల ఆన్ లైన్ యాక్షన్ నిర్వహించిన ఆర్టీఏ సెంట్రల్ జోన్ కు రూ. 65 లక్షల 38 వేల 889 ఆదాయం సమకూర్చినట్లు రవాణా జాయింట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ కావాలని కోరుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కొత్త వెహికల్ కొంటే చాలు లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహనంలో ఇరవై శాతం డబ్బులు చెల్లించేందుకు సిద్దమవుతున్నారు. వాహనదారుల సెంటిమెంట్ రవాణాశాఖకు కాసులు కురిపిస్తుంది. సంఖ్యా శాస్ర్తం అనుసరించి కొందరు, తమకంటూ ప్రత్యేకంగా ఉండాలని కొందరు భావించి భారీగా ధర చెల్లిస్తున్నారు. ఖైరతాబాద్ రవాణాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో భాగంగా టీజీ09హెచ్ 9999 ఫ్యాన్సీ నెంబర్ ను ఓ వాహనదారుడు ఏకంగా రూ. 22 లక్షల 72 వేల 222 లను చెల్లించినట్లు జేటీసీ వెల్లడించారు.
Also Read: Reddy Betting App: వైఎస్ జగన్ ఆశీస్సులున్నాయా? నా అన్వేషణ షాకింగ్ వీడియో!
నెంబర్ రూ.2 లక్షల 60 వేల ఆన్ లైన్ వేలం
అలాగే టీజీ 09 జే 0009 ఫ్యాన్సీ నెంబర్ రూ. 6 లక్షల 80 వేలు, టీజీ 09 జే 0006 నెంబర్ ను వాహనదారుడు రూ. 5 లక్షల 70 వేల 666 చెల్లించినట్లు, టీజీ 09 జే 0099 నెంబర్ కు రూ,. 3 లక్షల 40 వేల ఆక్షన్ పలికినట్లు ఆయన వెల్లడించారు. టీజీ 09 జే 0001 నెంబర్ రూ.2 లక్షల 60 వేల ఆన్ లైన్ వేలం పలికినట్లు, టీజీ 09 జే 0005 ఫ్యాన్సీ నెంబర్ రూ. 2 లక్షల 40 వేల 100 పలికినట్లు, అలాగే టీజీ 09 జే 0018 నెంబర్ కూడా రూ.లక్షా 71 వేల 189 పలికినట్లు, టీజీ 09 జే 0007 నెంబర్ రూ.లక్షా 69 వేల 2 పలికినట్లు, టీజీ 09 జే 0077 నెంబర్ లక్షా 41 వేల 789, అలాగే టీజీ 09 జే 0123 నెంబర్ లక్షా 19 వేల 999, టీజీ 09 జే 0003 ఫ్యాన్సీ నెంబర్ ఆన్ లైన్ వేలంలో రూ. లక్షా 15 వేల 121 ధర పలకటంతో ఆర్టీఏ సెంట్రల్ జోన్ కు మొత్తం రూ. 65 లక్షల 38 వేల 889 ఆదాయం సమకూర్చినట్లు జేటీసీ రమేశ్ తెలిపారు.
Also Read: Sodara: సంపూ ఈసారి నవ్వించడమే కాదు.. ఏడిపిస్తాడట! సంపూ ‘సోదరా’ విశేషాలివే!
