Tonsil Stones: టాన్సిల్ స్టోన్స్ అనేవి గొంతు వెనుక భాగంలో కనిపించే చిన్న తెల్లటి లేదా పసుపు రంగు ముద్దలు. ఇవి చిన్నవిగా కనిపించినా, అసౌకర్యం, దుర్వాసన, గొంతు రాపిడి వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతాయి. చాలా మందికి ఇవి ప్రమాదకరమని అనిపించినా, నిజానికి టాన్సిల్ స్టోన్స్ ప్రాణాంతకమైనవి కావు. అయితే ఇవి పెరిగి పెద్దవిగా మారితే, గొంతులో ఒత్తిడి, మింగేటప్పుడు నొప్పి, లేదా మాట్లాడేటప్పుడు ఇబ్బందులు కలిగించే స్థాయికి వెళ్లవచ్చు. ముఖ్యంగా దుర్వాసన (హాలిటోసిస్) టాన్సిల్ స్టోన్స్‌కి అత్యంత సాధారణమైన లక్షణం, ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది.
టాన్సిల్ స్టోన్స్ ఏర్పడటానికి ముఖ్యమైన కారణాల్లో మౌత్ హైజీన్ లోపం ఒకటి. నోటిలో బ్యాక్టీరియా ఎక్కువైతే, ఆహారపు చిహ్నాలు టాన్సిల్ క్రిప్ట్స్‌లోకి వెళ్లి అక్కడే ఇరుక్కుపోతాయి. అలాగే, తరచూ సైనస్ ఇన్ఫెక్షన్లు ఉండే వ్యక్తుల్లో మ్యూకస్ టాన్సిల్స్‌పై పేరుకుపోయి రాళ్లుగా మారే అవకాశం ఎక్కువ. టాన్సిల్ క్రిప్ట్స్ ఉండే వారు కూడా ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు.
లక్షణాలు అందరికీ ఒక్కలాగా ఉండవు. కొంతమంది టాన్సిల్ స్టోన్స్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు గమనించకపోవచ్చు. మరి కొంతమందికి మాత్రం స్పష్టమైన తెల్లటి లేదా పసుపు ముద్దలు టాన్సిల్స్‌పై కనిపిస్తాయి. దుర్వాసనతో పాటు గొంతు నొప్పి, మింగేటప్పుడు ఇబ్బంది, చెవి నొప్పి కూడా వస్తుంది.
ఇవి తగ్గించుకోవడానికి, ముందుగా మంచి మౌత్ హైజీన్‌ను అలవాటు చేసుకోవాలి. రోజూ నీరు ఎక్కువగా తాగడం గొంతును శుభ్రం ఉంచి టాన్సిల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. యాంటీసెప్టిక్ మౌత్‌వాష్ వాడటం బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. గోరువెచ్చని ఉప్పునీటితో గార్గిల్ చేయడం కూడా గొంతులోని మ్యూకస్ తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. టాన్సిల్స్‌ను గట్టివాటితో గీకడం లాంటివి చేయకూడదు. దీని వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?
ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు?
1.దుర్వాసన (Bad Breath) – టాన్సిల్ స్టోన్స్‌లో అత్యంత సాధారణ లక్షణం
2. టాన్సిల్స్‌పై కనిపించే తెల్లటి/పసుపు ముద్దలు
3. మింగేటప్పుడు నొప్పి లేదా గొంతు రాపిడి ఉంటుంది
4. చెవి నొప్పి (ఇన్ఫెక్షన్ లేకపోయినా) వస్తుంది
5. తరచూ దగ్గు రావడం, గొంతు చికాకుగా అనిపిస్తుంది.
టాన్సిల్ స్టోన్స్ తగ్గించడానికి చేయాల్సినవి ఇవే..
1. మౌత్ హైజీన్ బ్రషింగ్, ఫ్లోసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి చేయండి.
2. నీటిని ఎక్కువగా తాగండి
3. యాంటీ సెప్టిక్ మౌత్‌వాష్ వాడండి
4. తరచూ సమస్యలు వస్తే డాక్టర్‌ను సంప్రదించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
