Prashant Kishor (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Prashant Kishor: వ్యూహాల ప్రశాంత్ కిశోర్ విలవిల.. పీకే మాట మీదుంటారా?

Prashant Kishor: అవును.. ఐప్యాక్‌ అంటూ తన వ్యూహ రచనతో దేశంలో ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత ప్రశాంత్ కిశోర్‌(Prashant Kishore)దే. తీరా చూస్తే రెండు మూడేళ్లు పాదయాత్ర చేసి, జన్‌సురాజ్‌ పార్టీ(Jansuraj Party)ని పెట్టి, బిహార్ ఎన్నికల్లో పోటీచేసి బొక్కబోర్లా పడ్డారు. అందర్నీ గెలిపించిన పీకే దాదాపు అన్ని స్థానాల్లో పోటీచేసినా కనీసం బోణీ కొట్టలేని పరిస్థితి. కేవలం 3.5 శాతం ఓట్లతో అనేకచోట్ల మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఎన్డీఏ కూటమికి తిరుగులేని విజయం దక్కింది. దీంతో గతంలో పీకే చేసిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఈ ఎన్నికల్లో 25 సీట్ల మార్కును దాటితే తాను రాజకీయాలను శాశ్వతంగా వదిలివేస్తానని ఆయన బహిరంగంగా సవాల్ విసిరారు. బిహార్‌లో నితీశ్ ప్రజాదరణ పూర్తిగా పడిపోయిందని, జేడీయూ 25 సీట్లు దాటడం అసాధ్యమని ఆయన గట్టిగానే వాదించారు. పీకే నాయకత్వం వహిస్తున్న జన సూరాజ్ ఉద్యమం ముఖ్యంగా నితీశ్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే, తుది ఫలితాల సరళి పీకే అంచనాను పూర్తిగా తలకిందులు చేసింది. నవంబర్ 14 నాటి తాజా లెక్కల ప్రకారం, జేడీయూ సుమారు 85 సీట్లలో విజయం సాధించి అంచనాలకు మించి రాణించింది. కూటమిలో బీజేపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ గణాంకాలు పీకే విధించిన 25 సీట్ల మార్కు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఈ ఫలితం నితీశ్ రాజకీ

సన్యాసం సంగతేంటి?

నితీశ్ నాయకత్వం బలంగా పుంజుకున్న నేపథ్యంలో, రాజకీయాలను శాశ్వతంగా వదిలివేస్తానని చేసిన ప్రతిజ్ఞను ప్రశాంత్ ఇప్పుడు నిలబెట్టుకుంటారా? లేదా? అనే ప్రశ్న బిహార్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు విజయాలు సాధించిపెట్టిన పీకే, స్వతహాగా నాయకుడిగా తన సొంత రాష్ట్రంలో చేసిన ఈ భారీ అంచనా వైఫల్యం, రాజకీయ సన్యాసంపై ఆయన తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిహార్ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని గొప్ప ఆశయాలతో అడుగుపెట్టిన పీకే పార్టీకి ఈ ఫలితాలతో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఈ ఫలితం, బీహార్‌లో ప్రాంతీయంగా బలంగా ఉన్న పెద్ద పార్టీలైన బీజేపీ, జేడీయూ (నితీష్ కుమార్) మరియు ఆర్జేడీ (తేజస్వి యాదవ్) వంటి వాటి ఆధిపత్యాన్ని ఏ మాత్రం కదిలించలేకపోయిందని నిరూపించింది. జన సూరాజ్ పూర్తిగా విఫలమవడంతో, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలనే పీకే ఆశయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్థిరపడిన రాజకీయ శక్తుల ముందు కొత్తగా వచ్చిన పార్టీలకు స్థానం లేదని ఈ ఫలితాలు తేల్చి చెప్పాయి.

Also Read: Warangal District: హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. ప్రైవేటు విద్యా సంస్థల నిరసన..?

పరాభవానికి కారణాలేంటి?

జన సూరాజ్ ఘోర వైఫల్యానికి దారితీసిన కారణాలపై రాజకీయ విశ్లేషకులు చాలా కారణాలే చెబుతున్నారు. పీకే పార్టీకి నాయకుడిగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించే బలమైన, సుపరిచితమైన ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖం లేకపోవడం పతనం కావడానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కేవలం వ్యూహకర్తగా మాత్రమే సుపరిచితులు, కానీ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఆయన కొత్త. అంతేకాకుండా, కొత్తగా ఏర్పడిన పార్టీ కావడంతో, స్థానికంగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు, ఓటు బ్యాంకును సమీకరించేందుకు అవసరమైన బలమైన సంస్థాగత యంత్రాంగం లేకపోయింది. ఎన్డీఏ, మహాఘటబంధన్ వంటి సుస్థిర కూటముల మధ్య జరిగిన పోరాటంలో, జన సూరాజ్ వంటి కొత్త పార్టీ ఎటువంటి బలమైన పొత్తు లేకుండా కేవలం అభివృద్ధి అజెండాతో మాత్రమే నిలదొక్కుకోలేకపోయాయి. బిహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని ఉంచి, స్థిరమైన పాలనను కోరుకున్నారు. ఈ నేపథ్యంలో, వారు గెలవని ప్రత్యామ్నాయ పార్టీకి ఓటు వేసి రిస్క్ తీసుకోవడానికి మొగ్గు చూపలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, పాదయాత్ర ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అది ఎన్నికల పరంగా ఓట్లుగా మారడంలో పూర్తిగా విఫలమైంది. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న పీకే, ఆ సమస్యలను పరిష్కరించగల విశ్వసనీయమైన రాజకీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేకపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి, బిహార్ రాజకీయాల్లో బలమైన రాజకీయ నాయకత్వం, సంస్థాగత నిర్మాణం ఉంటేనే మనుగడ సాధ్యమని, కేవలం అజెండాలు, వ్యూహాలు మాత్రమే సరిపోవని జన సూరాజ్ పరాజయం రుజువు చేసిందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

Also Read: Jio Hotstar: 1 బిలియన్ డౌన్‌లోడ్స్ క్లబ్‌లో జియోహాట్‌స్టార్.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎఫెక్ట్?

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!