Gold Chain Theft: బ్రాహ్మణపల్లిలో నిందితుడి అరెస్ట్
4 తులాల బంగారు గొలుసు స్వాధీనం
సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు
చిక్కిన నిందితుడు
వివరాలు వెల్లడించిన జోగిపేట సీఐ అనిల్ కుమార్
జోగిపేట, స్వేచ్ఛ: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో సంచలనం రేపిన చైన్ స్నాచింగ్ కేసును 12 గంటల్లోనే స్థానిక పోలీసులు (Gold Chain Theft) చేధించారు. పట్టణంలోని సత్యసాయి కాలనీలో నివాసం ఉండే రిటైర్ టీచర్ సదాశివగౌడ్ అత్తయ్య శంకరంపేట మాణెమ్మ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని (Crime News) దొంగ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జోగిపేట సీఐ అనీల్‌కుమార్ ఎస్‌ఐ పాండుతో కలిసి గురువారం సీఐ కార్యాలయలలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా అందోలు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నవీన్‌గా గుర్తించారు.
Read Also- Jubilee Hills Counting: రేపు జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఫలితం ఎప్పటిలోగా వస్తుందంటే?
ఘటన జరిగిన రోజే రాత్రి 8 గంటల సమయంలో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. దీంతో వెంటనే దొంగిలించిన బంగారు గొలుసును అదే రోజు రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం సమయంలో తనకు కావాల్సిన మందుల కోసం మెడికల్ షాపునకు భాదితురాలు మాణెమ్మ వెళ్లింది. స్థానిక హనుమాన్ చౌరస్తాలో ఆమెను నవీన్ గమనించి వెంబడించాడు. సత్యసాయి కాలనీ వరకు అనుసరించాడు. మహిళ ఇంట్లోకి వెళ్లగానే వెనుకాల వెళ్లి ఇంట్లో ఎవరూ లేరనుకొని ఆమె కళ్లలో కారం చల్లి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు.
Read Also- Happy Childrens Day: మీ పిల్లలకు ఇలా ప్రేమగా విషెస్ చెప్పండి!
అనంతరం ఎస్‌సీ కాలనీ మీదుగా క్రీడామైదానంలోకి పరుగెత్తి ఆ తర్వాత పట్టణంలో జనాలలో కలిసిపోయాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి ‘నేను ఇలా చేశాను.. నాకు భయం అవుతుంది’ అని చెప్పుకున్నట్లుగా తెలిసింది. అయితే నవీన్ మీద గతంలో ఎలాంటి నేరారోపణ కేసులు ఏమిలేకపోగా అతడికి 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అంతే కాకుండా ఇస్మాయిల్‌ఖాన్‌పేట, పటాన్‌చెరువు ప్రాంతల్లో బల్లర్ల వద్ద సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నవీన్ డిప్లామా పూర్తి చేసి దొంగతనానికి పాల్పడడాన్ని అతడి స్నేహితులు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ కేసులో ఎస్‌ఐ పాండు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ అరవింద్, సంజీవ్, సురేష్ దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించినట్లు ఆయన తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంస అందినట్టు ఆయన తెలిపారు.
