Delhi-Blast-Dubai (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Delhi blast Dubai link: ఢిల్లీ పేలుడు కేసులో మరో షాకింగ్.. దుబాయ్‌లో అనుమానితులు!

Delhi blast Dubai link: గత సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో కేసులో (Delhi Case blast Case) కొత్త కోణం బయటపడింది. ఇప్పటికే పాకిస్థాన్, టర్కియే దేశాల్లో ఉంటున్న కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతుండగా, తాజాగా మరో కొత్త సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టారు. ఢిల్లీ పేలుడు ఘటనతో దుబాయ్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి సంబంధాలు ఉన్నట్టు అధికారులు (Delhi blast Dubai link) పసిగట్టారు. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు మద్దతుగా శ్రీనగర్‌లో పోస్టర్లు అతికించినందుకు అరెస్టు చేసిన నిందితులలో ఒకరైన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రథర్‌ను దర్యాప్తు అధికారులు ప్రశ్నించిగా ఈ కొత్త ఆధారం బయటపడింది.

తన సోదరుడు ముజాఫర్ రథర్ 2 నెలల క్రితం దుబాయ్‌కి వెళ్లాడని, అయితే, అక్కడికి చేరుకోవడానికి ముందు పాకిస్థాన్‌‌కు వెళ్లాడని డాక్టర్ ఆదిల్ దర్యాప్తు అధికారులకు తెలిపాడు. దీంతో, దర్యాప్తు అధికారుల దృష్టి దుబాయ్‌లో ఉన్న వ్యక్తివైపు మళ్లింది. అనుమానిత వ్యక్తి ముజాఫర్ రథర్‌కు జైషే మహ్మద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి కావాల్సిన నిధులను సమకూర్చడం కోసమే దుబాయ్ వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు సందేహిస్తున్నారు. ముజాఫర్ దుబాయ్‌కి వెళ్లడానికి ముందు పాకిస్థాన్‌లో ఎవరెవర్ని కలిశాడనేది చిక్కుముడిగా మారింది. ఎవర్ని కలిశాడనేది తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Read Also- Jubilee Hills Counting: రేపు జూబ్లీహిల్స్ కౌంటింగ్.. ఫలితం ఎప్పటిలోగా వస్తుందంటే?

కాగా, ఢిల్లీ కారు పేలుడు ఘటనలో 13 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న డాక్టర్ ఆదిల్ రథర్ ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌కు చెందినవాడు. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశాడు. నవంబర్ 6న యూపీలో అతడిని అరెస్టు చేయడంతో ఉగ్ర కుట్ర బయటపడింది. డొంక లాగిన అధికారులు ఉగ్రవాద గ్రూపుల కోసం పనిచేస్తున్న వైద్యులు, మత పెద్దల భారీ నెట్‌వర్క్‌ను గుర్తించి, బయటపెట్టారు. టర్కీలోని అనుమానిత వ్యక్తులతో ఆదిల్‌కు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

తల్లితో మ్యాచ్ అయిన ఉమర్ డీఎన్ఏ

ఢిల్లీ పేలుడు ఘటనలో హ్యుందాయ్ ఐ20 కారును నడిపి, ఆత్మహుతికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ డీఎన్ఏ, అతడి తల్లి డీఎన్ఏతో సరిపోలింది. వందకు 100 శాతం సరిపోలాయని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. పేలుడు తర్వాత ఐ20 కారులో లభ్యమైన ఉమర్ ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలతో డీఎన్ఏను సరిపోల్చినట్టు సమాచారం. డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో సీనియర్ డాక్టర్‌గా పనిచేశాడు. పోలీసులు ఫరీదాబాద్‌లోని 2 నివాసాల నుంచి ఏకంగా 1900 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఉమర్ ఆందోళనకు గురయ్యాడు. తనను కూడా పోలీసులు వెతుకుతున్నారనే టెన్షన్‌తో ఈ ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఫరీదాబాద్‌లో వైద్యులు అరెస్టైన కొన్ని గంటల తర్వాత ఆత్మహుతికి పాల్పడ్డాడు. కాగా, జైషే మహ్మద్‌తో సంబంధాలున్న ఈ అనుమానిత వైద్యులు డిసెంబర్ 6న రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజున ఈ పేలుళ్లు జరపాలనుకున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్టు అరెస్టైన ఉగ్రవాదులు తెలిపారు.

Read Also- Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

Just In

01

Revolver Rita Trailer: అంతా ఫ్యామిలీ ఫ్యామిలీ.. బూతులు మాట్లాడుతున్నాడే!

Directors: ట్రెండ్ మారుతోంది.. దర్శకులే హీరోలుగా!

Koragajja: ‘కాంతార’ తరహాలో ‘కొరగజ్జ’.. గూస్‌బంప్స్ తెప్పించే మరో రూటెడ్ కథ వస్తోంది!

Gadwal: గద్వాలలో దొంగల హల్చల్.. వరుస ఘటనలతో జనాల బెంబేలు

Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు