Happy Children’s Day: ప్రతి ఏడాది నవంబర్ 14న మన దేశం బాలల దినోత్సవం (Children’s Day) ను పండుగలా జరుపుకుంటుంది. ఈ రోజు భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంలో పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా చిన్నారుల సంతోషంగా జరుపుకుంటారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు కేవలం చాక్లెట్లు, బొమ్మలు మాత్రమే కాకుండా, వారి ఆలోచనలను పెంచే బహుమతులు కూడా ఇవ్వడం ముఖ్యం.
1. పుస్తకాలు – జీవితానికి మంచి తోడు
పిల్లల వయస్సుకు తగ్గ యానిమేటెడ్ కథల పుస్తకాలు, సైన్స్ & ఇమాజినేషన్ బుక్స్ ఇవ్వండి. ఇవి వారికీ చదవడం అలవాటు చేస్తే వారి ఊహాశక్తిని కూడా పెరుగుతుంది.
2. ఆర్ట్, క్రాఫ్ట్ కిట్స్ – సృజనాత్మకతకు నూతన రంగులు
పిల్లలకు రంగులు వేయడం, కాగితాలతో ఆకారాలు చేయడం, హస్తకళల పట్ల ఆసక్తి కలిగించే కిట్స్ బహుమతిగా ఇవ్వండి. ఇవి మైండ్ రీలాక్స్ చేయడంలో ఇవి సహాయపడతాయి.
3. ఎడ్యుకేషనల్ గేమ్స్ – ఆటలో నేర్చుకోవడం
పజిల్స్, బ్లాక్ బిల్డింగ్ సెట్స్, క్విజ్ గేమ్స్ లాంటి విద్యాత్మక గేమ్స్ పిల్లల్లో తర్కశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తాయి.
4. పర్సనలైజ్డ్ గిఫ్ట్‌లు – హృదయానికి దగ్గరైన బహుమతి
పిల్లల పేరుతో ఉన్న కస్టమ్ మగ్స్, ఫోటో ఫ్రేమ్స్ లేదా పేరుతో ఉన్న బ్యాగ్‌లు, వాటర్ బాటిల్స్ ఇవ్వడం వాళ్లు ఎంతో ఆనందిస్తారు.
5. అవుట్‌డోర్ గిఫ్ట్‌లు – ఫిజికల్ యాక్టివిటీకి ప్రోత్సాహం
సైకిల్, స్కేట్‌బోర్డ్, బ్యాడ్మింటన్ సెట్స్ లాంటి గిఫ్ట్‌లు పిల్లల్లో శారీరక వ్యాయామం అలవాటు చేస్తాయి. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
6. టైమ్ & అటెన్షన్ – పిల్లలకున్న అత్యంత విలువైన బహుమతి
పిల్లలతో రోజంతా గడపడం, వారితో మాట్లాడడం, కలిసి సినిమా లేదా ఆట ఆడటం లాంటివి చేయండి. ఇవే వారి జీవితంలో గుర్తుండిపోయే బహుమతులు. ప్రేమతో ఇచ్చిన సమయం ఏ వస్తువుకంటే గొప్పది కాదు.
