Uttam Kumar Reddy: కాళేశ్వరం పునరుద్దరణకు చర్యలు
Uttam Kumar Reddy ( image credit: swetcha reporter)
Telangana News

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలతోనే బ్యారేజీలు కూలాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు లో అంతర్భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల సంఘంతో సమన్వయం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజాధనంతో నిర్మించిన ఈ బ్యారేజ్ లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ మేడిగడ్డ కూలిపోవడానికి ,సుందిళ్ళ,అన్నారం బ్యారేజ్ లలో లీకేజీ లకు తప్పుడు నిర్ణయాలు, సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, న్యాయ కమిషన్లు స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు.

Also Read: Uttam Kumar Reddy: చరిత్ర సృష్టించిన తెలంగాణ సర్కార్.. ధాన్యం కొనుగోళ్లలో అరుదైన మైలురాయి

స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలి

సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ పై ఆరోపణల నేపధ్యంలో అర్హత కలిగిన స్వతంత్ర సాంకేతిక సంస్థలను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర జలవనరుల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త డిజైన్లను రూపొందించాలని నిపుణులను అదేశించామన్నారు.ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు ఐఐటీ అనుబంధ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. పూణే లోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో జియో ఫిజికల్ ,హైడ్రాలిక్ టెస్ట్ లు నిర్వహించి నష్టం విలువ అంచనా వేసి పనుల పునరుద్ధరణకు అంకురార్పణ చుట్టబోతున్నామన్నారు.

సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీరు చేరుకుందని, 15 నుంచి 20 రోజులలో నీరు తగ్గిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. తొలుత ఐదు సంస్థలను ఎంపిక చేసి అందులో మూడింటిని ఫైనల్ చేస్తామని వెల్లడించారు. డ్యామ్ సేఫ్టీ రంగంలో అనుభవం కలిగి ఉండడంతో పాటు సాంకేతిక సంస్థలతో అనుబంధం కలిగి ఉన్న సంస్థలనే ఫైనల్ చేస్తామన్నారు. పునరుద్ధరణ వ్యయం మొత్తం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గడిచిన అనుభవాల దృష్ట్యా ప్రజా ఆస్తుల పరిరక్షణ నిమిత్తం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పునరుద్ధరణ పనులు చేపట్ట బోతున్నట్లు తెలిపారు. డిజైన్ లోపాలు, పనుల నిర్లక్ష్యం ,ఆర్థికంగా జరిగిన అవకతవకలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

ఇదే విషయంలో విచారణ చేసిన విజిలెన్స్ శాఖ సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందన్నారు. సమ్మక్క-సారక్క, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్, చనకా-కోరాట, దేవాదుల, చిన్న కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ హెలిబోర్న్ సర్వే, డిండి లతో పాటు జూరాల వద్ద నిర్మించనున్న ప్రత్యామ్యాయ బ్రిడ్జి, సింగూర్ కాలువ లైనింగ్ పనులను సమీక్షించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యానాధ్ దాస్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Also ReadUttam Kumar Reddy: ధాన్యం దిగుబడిలో.. తెలంగాణ ఆల్ టైం రికార్డ్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?