Jupally Krishna Rao ( image credit: Swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో   కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి జూపల్లి కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణ నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు.  ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 100 శాతం సబ్సిడీతో అమలు చేస్తోంది.

Also Read: Jupally Krishna Rao: కేసీఆర్ ఫ్యామిలీ లిక్కర్ దందా అంబాసిడర్లు: మంత్రి జూపల్లి కృష్ణారావు

పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం

రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని హెచ్చరించారు. అలవి వలలతో చిన్న చేప పిల్లలు పడిపోవడం వలన మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతోందని, అటువంటి చర్యలకు కఠిన శిక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. చేప పిల్లల సైజు బాగుండేలా, నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Jupally Krishna Rao: రైతులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో పని చేయాలి.. అధికారులకు మంత్రి జూపల్లి కీలక అదేశాలు

Just In

01

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

Agricultural Market: వ్యవసాయ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు.. రైతుల వోడ్లకు స్థలమే లేక ఇబ్బందులు

Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు