Jogipet ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogipet: జోగిపేటలో పట్టపగలు పుస్తెలతాడు చోరీ.. మహిళ మెడలో లాక్కెళ్లిన దొంగ!

Jogipet: జోగిపేట పట్టణంలో పట్టపగలు రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు సదాశివగౌడ్‌ ఇంట్లోకి గుర్తు తెలియని దొంగ ప్రవేశించి ఆయన అత్త శంకరంపేట మాణెమ్మ కళ్లల్లో కారంపొడి చల్లి నాలుగు తులాల బంగారు నాలుగు వరసల పుస్తెల తాడును దొంగిలించిన సంఘటన జరిగింది. పట్టణంలోని సత్యసాయి బాబ కాలనీలో నివాసం ఉంటున్న సదాశివగౌడ్‌ భార్య వెంకట లక్ష్మి వద్ద మాణెమ్మ కొద్ది రోజులుగా ఉంటుంది. పడమర వైపున చిన్న గేట్‌కు కొద్ది దూరంలో మాణెమ్మ కూర్చొని ఉంది.

Also ReadSingareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!

మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కునేందుకు ప్రయత్నం

గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గేట్‌ను తానే తెరచుకొని అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ లోనికి ప్రవేశించాడు. అక్కడే ఉన్న మాణెమ్మ వద్దకు వెళ్లి కళ్లల్లో కారం చల్లి ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే పడుకొని ఉన్న వెంకట లక్ష్మి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా దొంగ ఆమెను బలవంతంగా తోసేసి మాణెమ్మ మెడలో నుంచి పుస్తెల తాడును లాక్కొని పడమర దిశలోని ఎస్‌సీ కాలనీ వైపు పరుగుతీసి ఎడమవైపునకు ఒక్కడే పరిగెత్తినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అక్కడే ఉన్న ఇద్దరు పాఠశాల విద్యార్థులు వారిని వెంబడించే ప్రయత్నం చేసినా లాభంలే కుండా పోయింది.

సత్యసాయి కాలనీలో చైన్‌స్నాచింగ్‌ జరిగిన సంఘటన

ఈ విషయం కాలనీలో తెలిసిపోవడంతో వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సత్యసాయి కాలనీలో చైన్‌స్నాచింగ్‌ జరిగిన సంఘటన విషయం తెలుసుకున్న సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐ పాండులు సంఘటన జరిగిన ఇంటిని సందర్శించి భాదితురాలు మాణెమ్మను విచారించారు. సంఘటన వివరాలను భాదితురాలి కూతురు వెంకట లక్ష్మి పోలీసులకు వివరించారు. కాలనీలో దగ్గరలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగ ఎటువైపు పారిపోయాడు అన్న విషయంపై ఇబ్బంది పడ్డారు. ఉదయం పూట మందుల కోసం మెడికల్‌ షాపునకు మాణెమ్మ వెళ్లడం వల్లనే దొంగ రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడి ఉంటారని కాలనీ వాసులు భావిస్తున్నారు. భాదితురాలు మాణెమ్మ తన నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Bhu Bharati: భూ కబ్జాలకు సర్కార్ చెక్!.. యాక్షన్ ప్లాన్‌ను సిద్దం చేస్తున్న అధికారులు

Just In

01

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

Agricultural Market: వ్యవసాయ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు.. రైతుల వోడ్లకు స్థలమే లేక ఇబ్బందులు

Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!

Huzurabad: కాలేజీ ఒకచోట, పరీక్షలు ఇంకోచోట.. వాగ్దేవి కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల అయోమయం!

Kunamneni Sambasiva Rao: సిపిఐ శతాబ్ది ఉత్సవాలు వంద సంవత్సరాలు గుర్తుండేలా నిర్వహించాలి : ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు