Bhu Bharati: రాష్ట్రంలో భూ కబ్జాలను నియంత్రించాలని ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు సాగుతుంది. భూ భారతి(Bhu Bharati) ద్వారా ఇప్పటికే కొన్ని భూ సమస్యలకు పరిష్కారం లభించగా, పాత యాక్ట్‌లను సవరించడం ద్వారా మరి కొన్ని భూ పంచాయితీలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో గతంలోని యాక్ట్‌లపై పూర్తిగా స్టడీ చేయాలని ప్రభుత్వం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. టెక్నికల్ సమస్యలను తొలగించేందుకు ప్రస్తుత పరిస్థితులకు ఆధారంగా రివైజ్డ్ చేసే వెసులుబాటుపై అధ్యయనం చేయాలని సూచించింది. ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా పాత యాక్ట్‌లను ఎలా సవరించానే దానిపై ప్రత్యేక రిపోర్టును కోరింది.
ఎండోమెంట్ యాక్ట్ సవరణ..
ముఖ్యంగా ఆలయ భూములకు సంబంధించిన దేవాదాయ శాఖ(Endowment Department) చట్టం 1987లోని సెక్షన్ 83, 84లను సవరించాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. ఈ సెక్షన్లు మత, ధార్మిక సంస్థల భూములను ఆక్రమించిన వారిని తొలగించడం, ఆక్రమణలను నిర్ధారించే విధానాలను సూచిస్తుంది. ఇప్పటికే ఈ యాక్ట్‌ను ఏపీలో సవరించారు. దీని వలన అక్రమలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈజీగా ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. దీంతో తెలంగాణ(Telangana)లోనూ ఎండోమెంట్ యాక్ట్ సవరణకు ఆఫీసర్లు ప్రతిపాదనలు పెట్టారు. దీంతో పాటు హౌసింగ్(Hosing), ఫారెస్ట్)Forest), అసైన్డ్ భూములు, సాధాబైనామాలు, చెరువుల కబ్జాలు, రెవెన్యూ ల్యాండ్ కబ్జాలు వంటిని కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సర్కార్ ఆఫీసర్లకు సూచించింది. పాత యాక్ట్‌లు, ఉత్తర్వులన్నీ పూర్తి స్థాయిలో స్టడీ చేయాలని ఆదేశించింది.
ప్రస్తుత చట్టంతో ఏం జరుగుతుంది?
ఎండోమెంట్ 1987 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ, దీనిలోని 83,84 క్లాజ్‌లలో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం దేవాదాయ శాఖ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు పెడితే.. అది ప్రభుత్వ భూమిగా సాక్షాత్తు ఎండోమెంట్ డిపార్ట్‌మెంటే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. దీని వలన కొన్ని సందర్భాల్లో ప్రస్తుత టెక్నాలజీల్లో కొన్ని టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. ఈ 83,84 క్లాజ్ లను సవరిస్తే.. కబ్జా పెట్టిన ప్రైవేట్ వ్యక్తులే తమ భూమిగా చట్ట బద్ధంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వ భూమిలపై కన్ను వేసే కబ్జా దారులు వెనక్కి తగ్గుతారనేది సర్కార్ భావన.
రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఇలాంటి కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 600 నుంచి 700 వందల ఎకరాలు దేవాదాయ శాఖలో ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలు పెట్టినట్లు నివేదిక తయారైంది. ఈ చట్టం సవరణ ద్వారా వాటిని సులువుగా స్వాధీనం చేసుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీంతోనే త్వరలో చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నట్లు సమాచారం. ఫారెస్ట్ శాఖలో కూడా పాత చట్టాలతో ఇలాంటి కబ్జాలు జరుగుతున్నట్లు సర్కార్ గుర్తించింది. వాటిపై కూడా స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసేందుకు సర్కార్ రెడీ అయింది.
Also Read: Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?
కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం..?
దేవాదాయ, వక్ఫ్, హౌజింగ్, ఫారెస్ట్, అసైన్డ్ తదితర ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే, తనిఖీలు నిర్వహించి రికార్డుల ఆధారంగా నిర్ధారించేందుకు ప్రత్యేక అధికారులు అవసరం ఉంటుంది. దీంతోనే ఉమ్మడి ఏపీలో అడిషనల్ కలెక్టర్లు ఈ వ్యవహారాలను మానిటరింగ్ చేసేవారు. కానీ కేసీఆర్(KCR) ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిషనల్ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించలేదు. తద్వారా ల్యాండ్ డిస్‌ప్యూట్‌లు భారీగా పెండింగ్‌లో పడ్డాయి. కబ్జాలు యథేచ్చగా జరగడంతో పాటు కేసులు కూడా ఆ తరహాలోనే నిలిచిపోయాయి. అడిషనల్ కలెక్టర్లు వీటిని మానిటరింగ్ చేయడంతో పాటు ట్రైబ్యునల్, కోర్టులలోనూ ఫాలోఅప్ చేసి ప్రభుత్వ భూములు రక్షించేందుకు ఉపయోగపడుతుంది. పదేళ్ల నిర్లక్ష్యం వలన ఈ ప్రాసెస్ జరగలేదు. దీంతో తాజాగా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు ‘ఎక్స్ ఆఫీసియో ఫారెస్ట్ ఆఫీసర్లు(‘Ex-officio Forest Officers’)గా’ అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కబ్జా భూములకు పరిష్కారం లభిస్తుందని సర్కార్ ఆలోచన.
భూ భారతితో సమగ్ర భూ పరిపాలన..
భూ భారతి అనేది ధరణికి ఒక మెరుగైన ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. దీని వలన భూ హక్కుల పరిరక్షణ, భూ సంబంధిత లావాదేవీలను సులభతరం చేసేందుకు సులువుగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. యాజమాన్య హక్కులు స్పష్టంగా లేని పార్ట్ బీ భూములను భూ భారతి ద్వారా గుర్తించి, క్రమబద్ధీకరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించేందుకు వెలుసుబాలు కలిగింది. అంతేగాక గతంలో పరిష్కారం కాని లక్షల సంఖ్యలో ఉన్న సాదాబైనామాల (అన్-రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్స్) సమస్యను కూడా భూ భారతి ద్వారా పరిష్కరించేందుకు అవకాశం కల్పించారు. దీంతో పాటు రెవెన్యూ(Revenu), ఎండోమెంట్, వక్ఫ్, రిజిస్ట్రేషన్ వంటి అన్ని విభాగాల భూములకు సంబంధించిన వివాదాల క్లియరెన్స్‌ను వేగవంతం చేసేందుకు తాజాగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రెవెన్యూ, ఎండోమెంట్, వక్ఫ్, రిజిస్ట్రేషన్ విభాగాల అధికారులు ఉమ్మడిగా పనిచేసి, ప్రభుత్వ భూముల హద్దులను గుర్తించి, వాటిని సంరక్షించేలా సమన్వయంతో పనిచేయాలని సీఎం కూడా ఆదేశించారు. ఇక ఇప్పటికే గ్రామ నక్షాలు, డిజిటల్ సర్వే(Digital survey)లు, జియో ట్యాగింగ్(Jio Taging), హౌసింగ్ బోర్డు భూములకు గోడ, పెన్సింగ్ వంటి నిర్ణయాలతో కొన్ని రకాల కబ్జాలు నియత్రించగలిగితే, చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ, ప్రత్యేక సైన్ బోర్డు వంటి వాటితో కొన్ని కబ్జాలకు అడ్డుకట్ట వేశామని ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
