Al Falah University: ఉగ్రవాద డాక్టర్లపై యూనివర్శిటీ కీలక ప్రకటన
Al Falah University (Image Source: Twitter)
జాతీయం

Al Falah University: ఉగ్రవాదులకు అడ్డా అంటూ ఆరోపణలు.. స్పందించిన అల్‌-ఫలాహ్‌ యూనివర్శిటీ

Al Falah University: హరియాణాలోని ఫరిదాబాద్ లో గల అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఉగ్రవాద ఆరోపణలపై ఆ కాలేజీకి చెందిన డాక్టర్లను దర్యాప్తు వర్గాలు అదుపులోకి తీసుకోవడంతో ఈ యూనివర్శిటీ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఫరిదాబాద్ లో భారీగా పేలుడు సామాగ్రి బయటపడటంతో పాటు దిల్లీ పేలుడు వెనుక ఈ డాక్టర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారంతా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నారు. దీంతో ఆ యూనివర్శిటీ ఉగ్రకార్యక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. దీంతో అల్ ఫలాహ్ యూనివర్శిటీ కీలక ప్రకటన విడుదల చేసింది.

వీసీ ఏమన్నారంటే?

ఉగ్రవాదుల అరెస్ట్ నేపథ్యంలో తమ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలను అల్ ఫలాహ్ విశ్వవిద్యాల వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డా. భూపిందర్ కౌర్ ఆనంద్ (Bhupinder Kaur Anand) ఖండించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేస్తూ తమ యూనివర్శిటీపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టైన వైద్యులకు యూనివర్శిటీకి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని వీసీ స్పష్టం చేశారు. తమ యూనివర్శిటీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని.. వారి వ్యక్తిగత చర్యలతో యూనివర్శిటీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

ఆ ప్రచారంలో వాస్తవం లేదు

అల్ ఫలాహ్ గ్రూప్ 1997 నుండి పలు విద్యా సంస్థలను నిర్వహిస్తోందని వైస్ ఛాన్స్ లర్ తెలిపారు. ఈ యూనివర్సిటీ.. గ్రాంట్స్ కమిషన్ (UGC) చేత గుర్తింపు సైతం పొందిందని తెలిపారు. 2019 నుంచి ఇక్కడ ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని.. ఈ యూనివర్శిటీలో పట్టభద్రులైన విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి వైద్యులుగా గుర్తింపు పొందారని వీసీ తెలిపారు. అయితే తమ యూనివర్శిటీలో పనిచేసే ఇద్దరు వైద్యులను దర్యాప్తు వర్గాలు అదుపులోకి తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో రసాయన పదార్థాలను భద్రపరిచారని, ల్యాబ్ లో ప్రయోగాలు సైతం జరిగాయంటూ వస్తోన్న వార్తలను ఈ సందర్భంగా వీసీ ఖండించారు. తమ ప్రాంగణంలో ఎలాంటి పేలుడు పదార్థాలు నిల్వ చేయబడలేదని స్పష్టం చేశారు.

Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

కావాలనే టార్గెట్ చేస్తున్నారు

డాక్టర్ల అరెస్టును అడ్డుపెట్టుకొని కొందరు కుట్రపూరితంగా విశ్వవిద్యాలయంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వీసీ భూపిందర్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి వార్తలను ప్రచారం చేసే ముందు అందులోని నిజానిజాలను ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై ఉందని అన్నారు. కాగా 2,900 కిలోల పేలుడు పదార్థాల స్వాధీనానికి సంబంధించి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులను దర్యాప్తు వర్గాలు రీసెంట్ గా అరెస్ట్ చేశాయి. దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు వెనుక ఈ ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీలో సోదాలు నిర్వహించి.. 50 మందిని పైగా దర్యాప్తు వర్గాలు విచారించాయి.

Also Read: Dr Shaheen’s Ex-Husband: నా భార్య మంచిది.. తప్పు చేసుండదు.. మహిళా డాక్టర్ మాజీ భర్త

Just In

01

Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల.. వార్షిక నివేదిక విడుదల

Sikkim Sundari: అంతుచిక్కని రహస్యం.. రాతి నుంచి పుట్టుకొచ్చే.. అరుదైన హిమాలయ పువ్వు!

Baba Vangas 2026 Prediction: 2026లో ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా అంటున్న బాబా వంగా.. మీ రాశి ఉందా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డతో మూవీ అనౌన్స్ చేసిన నిర్మాత నాగవంశీ.. దర్శకుడు ఎవరంటే?

KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?.. ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు: కేటీఆర్