CM Chandrababu (Image Source: Twitter)
జాతీయం

CM Chandrababu: సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన.. 2029 నాటికి ప్రతీ ఒక్కరికి సొంతిల్లు!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో అనమ్మయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో జరిగిన ఇళ్ల పంపిణి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఇంటి తాళాలను అందజేశారు.

సొంతిల్లు.. భవిష్యత్తుకు నాంది

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సొంతిళ్లు అనేది ప్రజల భవిష్యత్తుకు నాంది అని అన్నారు. పక్కా గృహాలను 1986లో ఎన్టీఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు అన్నారు. ‘కూటమి ఏర్పడిన 17 నెలల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎలా అభివృద్ధి చేయాలో అంతుపట్టడం లేదు. గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. రాయచోటి లాంటి వెనుకబడిన ప్రాంతంలో నేడు డ్రిప్ సిస్టం అందుబాటులో ఉంది. ఈ ఘనత మనదే. ఈ రోజు 3 లక్షల ఇళ్లు గృహ ప్రవేశం చేసేలా చేశాం. అన్నమయ్య జిల్లాలో 60 వేల ఇళ్లు మంజూరు చేసి 10 వేలు పూర్తి చేశాం. గత ప్రభుత్వంలో పేదవాళ్ల ఇళ్లు రద్దు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నా నిధులు ఇస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

2029 నాటికి పేదవాడికి సొంతిల్లు

మరోవైపు రాయచోటి ప్రజల అభిమానం చూస్తుంటే తనకు చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘కనిగిరి నుంచి 98 పరిశ్రమలకు ఫౌండేషన్ వేశాం. చదువుంటే ప్రపంచాన్ని శాశించే శక్తి వస్తుంది. అందరి కంటే తలసరి ఆదాయం ఉన్న వ్యక్తులు తెలుగు జాతి అని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్ లు ఏర్పాటు చేస్తా. ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తా. డ్వాక్రా సంఘాల దగ్గర ఇప్పుడు 25 వేల నిధి ఉంది. 2029 లోపు ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.

Also Read: Dr Shaheen’s Ex-Husband: నా భార్య మంచిది.. తప్పు చేసుండదు.. మహిళా డాక్టర్ మాజీ భర్త

2 ఏళ్లలో 2 లక్షల ఇళ్లు: మంత్రి

మరోవైపు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారధి మాట్లాడుతూ… 2 ఏళ్లలో 2 లక్షల ఇళ్లను నిర్మించినట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసిలకు కేటాయించిన నిధులు రద్దు చేశారు. ఏపిలోని ఏ ఒక్కరూ ఇల్లు లేదని అనకుండా చేయాలని ముఖ్యమంత్రి మాకూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇళ్ల నిర్మాణాలకు అదనపు నిధులు కేటాయించాం. ఫించన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచిన ఘనత మన ప్రభుత్వానిదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఫించన్లు పెంచాం. రైతులకు అన్నధాత సుఖీభవ క్రింద రూ.20 వేలు ఇస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధిలో మన ప్రభుత్వానికి ఎవరు సాటిలేరు’ అని మంత్రి పార్థసారధి అన్నారు.

Also Read: Delhi Blast Suspects: టార్గెట్ దీపావళి.. ఆపై జనవరి 26కు ఛేంజ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Just In

01

Nizamabad: మానవత్వం చాటుకున్న ఇందూరు యువత.. రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు!

Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్

TG High Court: సంధ్యా శ్రీ‌ధ‌ర్‌‌ ఆక్రమ‌ణ‌ల‌పై హైకోర్టు సీరియ‌స్‌.. బాధితుల‌కు అండ‌గా ఉంటామని స్పష్టీకరణ!

Delhi Car Blast: భూటాన్ నుంచి రిటర్న్.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన మోదీ.. బాధితులకు పరామర్శ

GHMC: 226 పోస్టుల భర్తీ కోసం సర్కారుకు ప్రతిపాదన..పెరుగుతున్న పనిభారంతో ప్లానింగ్ వింగ్ పరేషాన్!