Kunamneni Sambasiva Rao: ఏకైక మార్గం సోషలిజమే
Kunamneni Sambasiva Rao ( image credit: swetcha reporter)
Political News

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Kunamneni Sambasiva Rao: ప్రజల భవిష్యత్తు సమానత్వం, సౌభ్రాతృత్వం, ఆర్థిక న్యాయం ఆధారిత సోషలిస్టు వ్యవస్థలోనే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు, కుల వివక్ష, పేద, ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమేనని ఆయన స్పష్టం చేశారు. జనసేవా దళ్ రాష్ట్ర సమితి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సోషలిస్ట్​ వ్యవస్థ స్థాపించడానికి ఆ దిశగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.యువత శ్రీశ్రీని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. నునుగు మీసాల యవనంలోనే దేశ స్వాతంత్ర్యం కోసం భగత్​ సింగ్​ ఉరి కంభం ఎక్కారని, ఆయన స్ఫూర్తితో యువజన, విద్యార్థి సమాఖ్యల ఏర్పడ్డాయన్నారు.

Also Read: Kunamneni Sambasiva Rao: బీసీ రిజర్వేషన్ల అంశంలో దోషి బీజేపీనే.. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు

భారీ జనసేవా దళ్ ర్యాలీ

సీపీఐ 100 ఏండ్ల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు 15వేల మంది యువ కమ్యూనిస్టులతో భారీ జనసేవా దళ్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.  యూరప్ కమ్యూనిస్టులకు గాలి వీస్తుందని, నేపాల్లో అన్ని వామపక్ష పార్టీల ఐక్యత కావడం రానున్నది సోషలిస్ట్ వ్యవస్థ అనేదానికి నిదర్శనమన్నారు. దేశం కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి వెళ్తుందని, పేదలకు న్యాయం జరగాలంటే, ఉత్పత్తి సాధనాలు ప్రజల చేతుల్లోకి రావాలని అదే నిజమైన సోషలిజమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జనసేవా దళ్​ రాష్ట్ర సమితి కన్వీనర్​ పంజాల రమేశ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, బాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Kunamneni Sambasiva Rao: మాతో ఎవరు కలిసి వస్తారో.. ఆ పార్టీలతో ముందుకు పోతాం: ఎమ్మెల్యే కూనంనేని

Just In

01

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!

Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!

Indian Railways: రైల్వేస్ కీలక నిర్ణయం… ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్!

Chamala Kiran Kumar Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా.. ఎంపీ చామల కేటీఆర్‌కు సవాల్!